పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/98

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

79


సంధివచనములఁ జెప్పుకోణంగి లేక సూత్రధారుఁడు 'వచ్చెనమ్మా సత్యభామ.' ఇత్యాది విధములను బాత్రములఁ బేర్కొనఁగాఁ దద్వేషధారులు వచ్చి, తమయాటపాటలు నెఱపుదురు. ఇ ట్లింకను బెంపొందిన యక్షగానములు తెరలు, రంగభేదములు కలవయి కొంతసంస్కృత నాటకచ్చాయయుఁ జొప్పడఁగా నాటకము లనుపేరనుగూడఁ బదు నెనిమిదవ శతాబ్దినాఁటికిఁ బేర్వెలసినవి.

ఇంచుమించుగాఁ దెలుఁగున నేనూఱింటిదాఁక లెక్కింపఁ దగియున్న యక్షగానములలో సుగ్రీవవిజయ మొకప్రశస్తకృతి.

దానికర్త

కందుకూరి రుద్రకవి

ఈతఁడు విశ్వబ్రాహ్మణవంశ్యుఁడు. కందుకూరికిఁ జేరువనే పాలేటియొడ్డునఁ గలచింతలపాలె మనుగ్రామ మీతనియూరు. ఆయూరనే తద్వంశ్యు లిప్పటికిని గలరు. రుద్రకవి మూలమున నావంశమువారికి 'కవివారు' అని యుపనామ మేర్పడినది. ఆవంశమున రుద్రకవికిఁ దర్వాతఁ బలువురు రుద్రకవినామకు లుండిరి. తొలుతటి రుద్రకవి కృష్ణదేవరాయల యాస్థానమున నష్టదిగ్గజము లనఁబడుకవు లెనమండుగురిలో నొక్కఁడుగా నుండెనఁట. [1]మల్కిబ్రహీంకాలమునగూడ నొక రుద్రకవి యుండెను. ఇబ్రహీంకాలమునఁ గలరుద్రకవియే కృష్ణరాయలకాలమున బాలుఁడుగా నుండఁబోలును. చింతలపాలె మనుగ్రామము మల్కిబ్రహీం ప్రభువే రుద్రకవి కొసఁగెను.

అద్యాశీతిచతుశ్శతాధిక సహస్రం వైశకాబ్దా గతాః
అస్మిన్ శ్రీజయవత్సరే జయతిథౌ మాసే చ మాఫేు తథా
పంచమ్యాం ద్వయతింత్రిణీజనపదం రుద్రస్య విద్వత్కవేః
ప్రీత్యా శ్రీయిభరామభూపతి రదాత్ క్షోణీధరాఖండలః||

  1. రుద్రకవి విషయమును చాటుపద్యమణిమంజరి ద్వితీయభాగమునఁ జూచునది,