పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

75



 గిల్కు గిల్కున మ్రోయుకింకిణీగుచ్చంబు
             తాళమానంబుతో మేళవింప
 రాగముననుండి లంఘించు రాగమునకు
 నురుమ యూరుద్వయంబుపై నొత్తిగిల్ల
 కామవల్లీమహాలక్ష్మి కైటభారి
 వలపు వాడుచు వచ్చె జక్కులపురంద్రి.

అప్పకవి యక్షగానలక్షణము నిట్లు చెప్పినాఁడు.

సీ|| తుద నేడులఘువులు తొలఁగించి చదివినఁ
               ద్రిపుటకు వృషభగతిపదయుగము
     లలిఁ గడపల నొక్కలఘువు మానిన జంపె
              మను ద్విరదగతిసమపదయుగము
     గురు తగురచ్చెరకుఁ దురగవల్గనా
              హ్వయ మేక తాళి యామధురగతికి(?)
     నంఫ్రిు కిర్వదినాలు గటతాళమున మాత్ర
             లోలి విశ్రాంతి పద్నాలుగింటఁ
     దెలియ నర్ధంబు నర్ధచంద్రికలు వీన
     యక్షగానప్రబంధంబు లతుకవచ్చు
     రగడభేదంబు లివి యండ్రు రసఁ గవీంద్రు
     లవితనిజసేవకస్తోమ! యబ్దిధామ!

పై పద్యమునుబట్టి చూడఁగా యక్షగానములందలి ప్రధాన గేయరచనములు దేశిరచన లగురగడలలోఁ గొంతమార్పు జరిపి-త్రిపుట, జంపె, ఏక, అట, అనుతాళముల కనుగుణముగాఁ గల్పింపఁబడినవిగాఁ గానవచ్చును. అప్పకవి రగడవికారరచనములను తాళములపేరనే పేర్కొనెను గాన వానికిఁ బేరులు వేఱె తెలుపలేదు. అప్పకవి పేర్కొన్నయీ రచనములే కాక యక్షగానములలో నింకను ననేకవిధము లయినదేశి రచనములు చేరినవి. ఏలలు, జోలలు, సువ్వాలలు, ఆరతులు, ధవళములు, చందమామసుద్దులు, వెన్నెలపదములు, విరాళిపదములు, తుమ్మెద