పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/69

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

మీఁగడ తఱకలు


యిచ్చి, యాశీర్వాదంబులచేత నతనిం బ్రమోదంబు నొందించి, కరమ్ములఁ దదీయశరీరమ్ము నివిరి, ముహూర్తమాత్రమునం దదృశ్యుఁ డగుటయు భూపాలుం డాసిద్దుని విచిత్రం బవలోకించి యిది సుందరేశ్వరువినోదం బని మనంబునం దలంచినవాఁడై లింగమూర్తిధరుం డగునమ్మహాదేవు సాన్నిధ్యంబున కరిగి భక్తిచేత నమస్కరించి యి ట్లని వినుతించె."

(ఇరువదియేడవ యధ్యాయము)

ఈ నంజరాజు కర్ణాటభాషయందు భారతేతిహాసమును వచన కావ్యముగా రచించెను. అదియును బ్రాచ్యలిఖితపుస్తక భాండాగారమునఁగలదు.

ఈకాలముననే మథురాపురీనాథుడైనవిజయరంగ చొక్కభూపాలకునాదరమునఁ బెక్కులు వచనకావ్యములును బద్యకావ్యములును రచింపcబడినవి.

రాజరాజనరేంద్ర, కృష్ణరాయు, రఘునాథరాయాదులవలె నీప్రభురత్నమును నాంధ్రకవీశ్వరుల కాలంబమై 1704 మొదలు 1731 వఱకు రాజ్య మేలెను. శేషము వెంకటపతి మొదలగువా రీతని యాస్థానకవులుగా నుండిరి. అహల్యాసంక్రందనవిలాసమును రచించిన సముఖమువెంలటకృష్ణప్పనాయకుం డీతనికొల్వున నున్నవాఁడు. అహల్యాసంక్రందనవిలాసమున

గీ|| 'సముఖమీనాక్షినృపగర్భవిమలజలధి
      చంద్ర! వేంకటకృష్ణేంద్ర! శౌర్యసాంద్ర!
      మునుపు జైమినిభారత మనఘ! వచన
      కావ్య మొనరించినట్టిసత్కవివి కావె' ||

అని తారాశశాంకవిజయ మొనర్చిన శేషమువేంకటపతి మెచ్చినట్లు వెంకటకృష్ణప్పనాయకుఁడు చెప్పుకొన్నజైమినిభారతవచన మిప్పు డీయాంధ్ర సాహిత్యపరిషత్తువారిచే దక్షిణదేశమునుండి సంపాదింపఁబడిన తాళపత్ర