పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

మీఁగడ తఱకలు


నెఱవేర్పందలంచి, యొక్కనాఁటి రాత్రియందు నొక్కరుడ, నవరత్నఖచిత దివ్యాభరణభూషితుండును, దివ్యచందనచర్చితగాత్రుండును. మనోజ్ఞ కుసుమమాలికాధరుండును నై వనంబునకుం జని, జగన్మోహనంబును, నవ్యక్తమధురంబును, నమృతోపమానంబును మాత్రాలయసమన్వితంబును నగువేణుగానం బొనర్చుటయు, సర్వభూతమనోహరం బయినయమ్మురళీ నాదం బాలకించి గోపాంగనలు మదనబాణవిదళితహృదయలై యవ్వసుదేవ నందను సమీపంబున కరుదెంచిరి. అం దొక్కసుందరి నిజగృహంబునంద యుండి శ్రీకృష్ణుని వేణునాదంబున కనురూపమును, నవ్యక్తమధురంబునుగా మెల్ల మెల్లన గానంబు గావించె."

(అయిదవయాశ్వాసము 13వ అధ్యాయము)

ఈతని గద్య మిట్లున్నది.

"ఇది శ్రీనందనందనచరణారవిందమత్తమధుకరాయమాణచిత్త చతుర్విధకవితాసామ్రాజ్యభోజ చంద్రగిరికృష్ణభూపాలక తనూజ భాగమాంబా గర్భశుక్తిముక్తాఫల తుపాకుల యనంతభూపాలక ప్రణీతం బైనవిష్ణుపురాణఁ బునందుఁ బ్రథమాశ్వాసము"

వచనభారతకర్త యయినవీరరాజు కుమారుం డగునంజరాజుచే సయితము పెక్కులు వచనకావ్యములు రచింపఁబడెను. నంజరాజు మైసూరురాజునొద్ద మంత్రియై మిక్కిలి యెన్నిక కెక్కినవాఁడు. ఈతని నుద్దేశించి సంస్కృతమున నభినవకాళిదాసబిరుదాంకుఁ డగునృసింహకవిచే నంజరాజయశోభూషణ మనుపేరఁ బ్రతాపరుద్రీయమునకుఁ బ్రతిబింబముగా నొకయలంకారశాస్త్రగ్రంథము రచియింపఁబడెను. తద్గ్రంథకర్త గ్రంథావ సానమున నిట్లు చెప్పకొన్నాఁడు.

శ్లో|| ఆలూరితిర్మలకవే రభినవభవభూతినామబిరుదస్య
      సుహృదా నృసింహకవినా కృతి రకృత నవీనకాళిదాసేన.