పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/66

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

47

ఈ వచనభారతము నీవీరరాజును మఱికొందఱును గలసి పూరించిన ట్లున్నది. తంజాపురపు సరస్వతీభాండాగారమున వచనాత్మకములగు శాంత్యానుశాసనికపర్వములు క్రమముగా నారాయణ తుపాకుల యనంతభూపాలక కర్తృకము లయినవి కలవు. ఇక్కడి యీయూదిపర్వము నందుఁగూడ వీరరాజు నాశ్వాసాంతగద్యమునం దొక్కచో నడుమఁ దుపాకులయనంతభూపాలకుగద్యమును వ్రాయబడియున్నది. ఈ తుపాకులయనంతభూపాలకుcడు మధురరాజులయొద్ద దళవాయి యని తెలియుచున్నది. ఈతఁడును వీరరాజుసమకాలపువాఁడే కాcదగును. అనంతభూపాలకకర్తృకము లయిన వచనకావ్యములు మఱికొన్ని గలవు. అందు విష్ణుపురాణము, భగవద్గీత యనుగ్రంథములు ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారమునం దున్నవి. విష్ణుపురాణ మాఱాశ్వాసముల గ్రంథముగా రచింపఁబడినది. వెన్నెలకంటి సూరనార్యుని విష్ణుపురాణముకంటె నియ్యది కడువిపులమై సంస్కృతమూలము ననుసరించుచున్నది. ఈ కృతియును శ్రీకృష్ణునకే సమర్పింపcబడెను. ఈ విష్ణుపురాణవచనము ధారాళ మగురచన గల్గి యించుక ప్రౌఢమై మిక్కిలి చక్కఁగ నున్నది. వచనభారత మందువలెఁ గాక యిందు సంస్కృతసమాసములు కొండొక మెండుగాఁ జూపట్టుచున్నవి.

ఇంచుక మచ్చు చూపుచున్నాఁడను.

“అంత శ్రీకృష్ణుండు విమలతరచంద్రికాసాంద్రంబును, హృదయానందకరంబునై, వికసితనీలోత్పలకుముదసౌరభంబులచే దిగంతంబులఁ బరిమళింపఁ జేయునట్టి శరత్కాలంబున నుత్పల్లకుసుమవాసనాసక్తంబులై ఝుంకారం బొనర్చునట్టి తుమ్మెదలమొత్తంబుచే నలంకృతంబును విహారయోగ్యంబును నగుబృందావనంబుం గనుంగొని, యుచ్చట గోపవనితానికరంబులతోడఁ గూడి రమియించి, వారల మనోరథంబులు