పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/38

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

19


తెనుఁగుననే రచియింపఁగాఁ దర్వాతివారు వానిని గర్ణాటమునకును, సంస్కృతమునకును బరివర్తించుకొనిరి. బసవపురాణపండితారాధ్య చరిత్రాదిగ్రంథములను శైవులు భారతరామాయణాదులవలెc బవిత్ర గ్రంథములుగాఁ బూజించుచుందురు. ఇది తెనుఁగున కొక గొప్ప గౌరవము. తన గ్రంథములు సర్వసామాన్యములుగా నుండవలె ననియు, నట్లుండుటకుఁ దెనుఁగు ద్విపదయే తగిన దనియు, గద్యపద్యాదిపూరిత మయిన సంస్కృతప్రాయరచన సర్వసామాన్యము కా దనియు సోమనాథుఁడు చెప్పినాడు.

"తప్పకుండఁగ ద్విపదలు రచియింతు
 నొప్పదు ద్విపద కావ్యోక్తి నావలదు
 ఆరూఢగద్య పద్యాది ప్రబంధ
 పూరితసంస్కృత భూయిష్ఠరచన
 మానుగా సర్వసామాన్యంబుగామి
 జానుదెనుఁగు విశేషము ప్రసన్నతకు.
                                     - పండితారాధ్య చరితము.

మఱియు -

ఉరుతర గద్యపద్యోక్తులకంటె
సరసమై పరఁగిన జానుదెనుంగు
చర్చింపఁగా సర్వసామాన్య మగుటఁ
గూర్చెద ద్విపదలు కోర్కిదైవాఱఁ
దెలుఁగుమాట లనంగవలదు వేదముల
కొలఁదియకాc జూడుc డిల నెట్టు లనిన
                                          - బసవపురాణము,

తెలుఁగు మాటలుగాదాయని తేలఁ దలంపవలదు. వేదములవలెఁ జూడుc డని చెప్పినాఁడు!