పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

మీఁగడ తఱకలు


మఱియు సమూహి, దాసి (దాసుఁడనుటకు) ముల్లోకనాథుఁడు, పుడమీశ్వరుఁడు, సర్వాంగకచ్చడము, దీపగంభములు, తవనిధి, మొదలగు ప్రయోగము లెన్నో శివకవులు తఱచుగాఁ బ్రయోగించినవి కలవు. ఇట్టి పదములు కొన్ని యితరకవుల కృతులలోఁగూడఁ గ్వాచిత్కముగాc గానవచ్చునుగాని శివకవులే వీనిని తఱచుగాఁ బ్రయోగించిరి. ఇటీవలి లాక్షణికులు కఱకంఠుఁడు, ప్రాణగొడ్డము, దినవెచ్చము మొదలగు పదములను గొన్నింటినిమాత్రము త్రోసిపుచ్చఁజాలక, యనింద్యగ్రామ్యములని పేరుపెట్టి ప్రయోగార్హము లనిరి. శివకవుల కృతులలో లాక్షణికు లనుగ్రహింపనివి యిట్టివి కుప్పతెప్పలుగా నున్నవి. మఱియు నిప్పటి వ్యాకరణమును దలక్రిందులొనర్చు ప్రయోగము లనేకము లున్నవి. మరియు నపూర్వశబ్దములు శబ్దరత్నాకరమందుc గానరానివి యనేకము లున్నవి. శివకవుల కృతులలోని వింతప్రయోగములను వేఱొకచోట వివరించి తెల్పుదును.

ఇతరకవులు వీరిని గర్హించిరి

ఇట్టి రచనావిధానము లితరాంధ్రకవులకు సమ్మతములు గావయ్యెను. వారు పాటించిన ఛందోనియములను భాషా నియమములను వీరు సరకుసేయక కొంత సడలింపఁజాగిరి. పాల్కురికిసోమనాథుని కాలముననే దీనిఁగూర్చి యోరుcగంటిలోఁ దగవు నడచినది.

సీ|| ఒకనాడు శివభక్తు లోcరుగంటను స్వయం
                 భూదేవుమంటపంబున వసించి
      బసవపురాణంబు పాటించి వినువేళ
                 హరునిఁగొల్వఁ బ్రతాపుఁ డచటి కేఁగి
      యాసంభ్రమం బేమి యనుడు భక్తులు బస
                 వనిపురాణం బర్థి వినెద రనిన
      విన నాపురాణంబు విధ మెట్లొకోయన్న
                 ధూర్తవిప్రుఁ డొకండు భర్తఁ జేరి