పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

మీఁగడ తఱకలు

క్రమమున నవి నాల్గుగణముల నడచుc
గ్రమదూరముగఁ బ్రయోగము సేయరాదు
ఆపాదమునకు మూcడవగణం బాది
దీపించుయతి యంబుధి ప్రియతనయ
యుపమింప నవి ప్రాసయుతములై రెండు
ద్విపదనా విలసిల్లె వికచాబ్జపాణి
ద్విపదకు ద్విపదకుఁ దెగఁజెప్పవలయు
నెపుడు - సంస్కృతమున నితరభాషలను
యతులలోపలఁ బ్రాసయతి దక్క సకల
యతులుఁ జెల్లును బ్రయోగానుసారమున
ద్విపదతో ద్విపద సంధిల నేకశబ్ద
మపుడు ప్రయోగింప నది యయుక్తంబు
మఱియు సంస్కృతపు సమాసరూపమున
నెఱయ నెన్నిటినైన నిర్మింపఁదగును
...................................................
అనులక్షణమ్ముల ననువొంది సుకవి
జనసుప్రయోగైకశరణమై-"
                                               - అష్టమహిషీకల్యాణము.

రంగనాథుని రామాయణము, గౌరనహరిశ్చంద్రచరిత్ర మొదలగు ద్విపదలందుఁ గానవచ్చు విధమునే యీ లక్షణము చెప్పచున్నది. శివకవుల ద్విపదరచన మిందులకు విరుద్ధముగా నున్నది. రంగనాథ రామాయణాదులందుc గానరాని ప్రాసయతి బసవపురాణము మొదలగు శివకవుల గ్రంథములం దున్నది. మఱియు, ద్విపదయు ద్విపదయుc గలయునప్పు డొక్కపదమే యిటుకొంత యటుకొంత యగునట్లు రంగనాథాదు లెక్కడను గూర్పరయిరి. పాల్కురికి సోమనాధాదులగు శివకవులు పదమధ్యమందే ద్విపదము ముగియునట్లు పెక్కుచోట్ల రచనము నెఱపిరి. సోమనాథుండు “జాతులు మాత్రానుసంధానగణవి, నీతులు గాన 'యనియతగణై', రనియును 'ప్రాసోవా' యనియు 'యతిర్వా'