పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంద్రాజిపండితులు వ్రాసిరంట! ఇది సంగతముగావచ్చును. ఇక్ష్వాకులను గూర్చి నేను వ్రాసిన వ్యాసమున[1] ఆంధ్రులకు ముండియు లని ధర్మామృత గ్రంథకథలోC బేరున్నట్లు తెలిపితిని. ముండక ముండియు శబ్దము లేకార్థవాచకములు గా వచ్చును. ధర్మామృతకథలోC బేర్కొనఁబడిన ముండియులే విష్ణుపురాణాదులలోఁ బేర్కొనంబడిన ముండకులు గాం దగుదురు.

పురాణములలోని కలియుగ రాజవంశానుచరితములనుగూర్చి పర్జీటర్ పండితులు వ్రాసిన గ్రంథము మిక్కిలి విలువగలదే. కాని దక్షిణహిందూదేశపు వ్రాంత ప్రతులలోని పాఠములకును, వారు ప్రకటించిన పాఠములకును భేదములు పెక్కులున్నవి. వానినెల్ల మరలC బరిశోధించి, దక్షిణ హిందూదేశపోలిఖి గ్రంథపాఠ భేదములను వేఱుగా నేను వెల్లడింపఁ జూచుచున్నాండను. పంుని బేర్కొనఁబడిన సాధనములు సాతవాహనులయాంధ్రత నాక్షేపింపరాకుండ నిలుపంగలవని నానమ్మకము. హాలునిచరిత్రమే యునcదగిన లీలావతీకథలో సిద్ధనాగార్జునుఁడు హాలునిమంత్రి యని కలదు[2]. సిద్ధనాగార్జునుఁ డంధ్రుడగుట నాతనిపేర వెలసియున్న శ్రీశైలపాదమగు సిద్ధనాగార్జునుని కొండయు, నక్కడి సూపములును నిరూపించుచున్నవి. అతని నేలిన రాజుగూడ నంధ్రుం డగుట సంగతముగాదా? మటియు సాతవాహనుల యంధ్రతకు సాధకములయిన విషయములు సాతవాహన సప్తశతిలోఁ జాలంగలవు, వానిని వేటొకచోట వెల్లడింతును.

  • * *
  1. 1 ప్రభవపుష్య భారతీసంచిక చూచునది.
  2. 2 రామకృష్ణకవిగారి పుష్పాంజలి. భారతి చూచునది.