పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మణు లని ప్రస్తుతులయిరి. శ్రీకాకుళ స్థలమాహాత్యమునంగూడ, నా యంధ్రనాయకస్వామి నాగదేవభట్టారకు నింటఁబుట్టిన బ్రాహ్మణుఁ డని కలదు. అక్కడ నాస్వామి బ్రాహ్మణకన్యను వివాహమాడెనంట! ఈ కథ శ్రీముఖ శాతకర్ణిది కాందగును. అంధ్రరాజులు తెలివాహనదీతీరమున నుండినట్లు బౌద్ధ జాతక కథలలోc గలదంట! లీలావతీకథ, హాలునినాటికి గోదావరి సప్తశాఖలు గల దని తెలుపుచున్నది. జాతకకథలలోఁ బేర్కొనం బడిన తెలివాహానది గోదావరీ సప్తశాఖలలో నొక్కటియగు తుల్యభాగ యగు నేమో యని నాయూహము.

సంస్కృత, దేశి, భాషాకృతులలోఁ బెక్కింట నంధ్రస్త్రీలకుచసాభాగ్య మసాధారణమైనదిగా వర్ణితమయ్యెను. ఆవర్ణన మన్వర్ధమయిన దని యమరావతీ సూపశిల్పములు ప్రతిపాదించుచున్నవి. ఆస్తూపనిర్మాణ కాలమున కంధ్రస్త్రీలకుఁగుచాచ్చాదనములేకుండుటనుగూడనమరావత్యాది సూపరూపములు నిరూపించుచున్నవి. అవికలులేని యంధ్ర స్త్రీలు ప్రతిష్టానమున కేంగినపిదప నతినిగూఢకుచ లగుఘూర్జర మాహారాష్ట్ర స్త్రీల సంగతిచేఁ గ్రోత్తనాగరకత ఒలసి, అవికలను పైంటలను నుంచుకొన సాగిరి, పైcటపదము ప్రతిష్టానపదభవమే. ప్రతిష్టానముననుండి యలవడినది గాన కుచాచ్చాదనమునకు నానగరముపేరే తద్జ్జపకముగాc బేరయ్యెను. అవికలకుఁగూడఁ బైఠిణీఱవిక లనియే పేరు. పైఠిణీపదము గూడC బ్రతిష్టానపదభవమే. సంస్కృతమున కంచుక మను పదమున్నను, నది స్త్రీపురుషసామాన్యమయిన ‘అంగరకా"కు పేరుగా నున్నది. సాతవాహనసప్తశతిలో నది ఘూర్జరాంగనలు వేసికొను మేలిముసుంగు ముఖమునకుఁగూడ నుండును) పర్యాయముగాఁ గలదు. అంధ్ర, ద్రవిడ,