పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాఁకిడిం బడిరి. కొంత యుత్తరరాజ్యమును గోల్పోయిరి. అప్పడు ధనకటకమునుగూడ వీ రుపరాజధానిగాఁ జేసికొనిరి. ఇక్ష్వాకు లప్పటికి దుర్బలులయి యుందురు, అనేకాధ్వరకర్తలును, వైదిక మతాభిమానులును నయ్య సాతవాహను, లిక్ష్వాకులవలె వారిమతమైన బౌద్ధమతమును బరిరక్షించిరి. బౌద్దులకు దానములఁ జేసిరి. వారి స్తూపములఁ గాపాడిరి. పెంపొందించిరి. కృష్ణాగోదావరీనదులనడిమిదేశమెల్లఁదుదకు వారి యేల్బడి క్రిందనే యుండెను. హాలసాతవాహనుండు సంధానించిన సాతవాహనసప్తశతిలోఁ దెలుంగుదేశమునకుఁ జెల్లఁదగిన వర్ణనలు పెక్కులు గలవు.

గోదావరీనది సముద్రముతో సంగమించునంతదాంకం గల దేశములో సాతవాహనవంశముతో సమానమయిన వంశము వే టొకటి లేదని యొక గాథలోఁగలదు. బ్రహ్మశ్రీమా, రామకృష్ణకవిగారు సంపాదించిన లీలావతీకథలో హాలునకు సప్తగోదావరతీరమున భీమేశ్వరమునఁ బెండ్లి జరిగినట్లు కలదు. అమరావతీస్తూపమున గౌతమీపుత్రశాతకర్ణి శాసన మున్నది. కృష్ణాముఖద్వారమున యజ్ఞశ్రీశాతకర్ణి పదునెన్మిదవపాలన వత్సరమున వేయింపCబడిన బౌద్ధదాత శాసనము దొరకినది. అంధ్రవల్లభుఁ డని, యంధ్రనాయకుఁడని, అంధ్రవిష్ణువని, శ్రీవల్లభుడని, సిరికాకొలినాథుం డని వర్ణితుం డగుశ్రీకాకుళాంధ్రనాయకస్వామి యంధ్రులగుసాతవాహనులలో నొక్కని పేర వెలసిన దైవమై యుండవచ్చునని నాతలంపు. సిరికకొలను అని యాగ్రామనామపుఁ దొలిరూపము. కొలనే వైష్ణవమువచ్చి దివ్యస్థలమై కొళ మయినది. అక్కడ గొప్ప చెఱువుండినట్లు స్థలమాహాత్యమునను గలదు. సిరిక పదము 'శ్రీముఖ పదమునకు తెలుఁగు వికృతి కాదగును. మడియు, వాసిష్ఠీపుత్రపులుమావి నాసికశాసనమున సాతవాహనులు