పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నిరూపించుచుండుట లేదా? ఈ శాసనములఁబట్టి సాతవాహనులు తొలుత, ముళకదేశమునో, యందలి యేకదేశమగు బళ్లారిప్రాంతమునో పాలించినట్లును, దానికే సాతవాహనరాష్ట్ర మని, సాతవాహనహార మని పేరయినట్లును దలCపవలసియుండును. అట్లు దలCపకుండుట నాల్గవప్రమాదము. తొలుత వారు వేంగీదేశమును బాలించుచున్న యంధ్రరాజు లగునిక్ష్వాకురాజులకు భృత్యు లయియుందురు. ఈ కారణముచేతనే కొన్ని పురాణములలో సాతవాహను లంధ్రభృత్యు లని పేర్కొనఁబడి యుందురు. క్రమశః ప్రబలులై కర్ణాటదేశమెల్లనేలియుందురు. ఈ కర్ణి రాజులపేరనే కర్ణినాండు' అని దేశనామ మేర్పడి, మార్పులుచెంది కన్నడ, కర్ణాట రూపములఁ జెందియుండవచ్చును. మైసూరు తల్కొండ స్టేటులో స్థానకుండూర శివాలయ శిలాశాసనమున "సాతకర్ణి పూజించిన యాలయములోc దాను పూజచేయుచు" న్నట్టు అర్చకుఁడు వ్రాసికొన్నాడు. ఇట్లు వారు క్రమముగాC బ్రాబల్యముఁజెంది, కుంతల ఘూర్జర మహారాష్ట్రాది దేశములను జయించి, క్రొత్తగా జయించినదేశముల పరిపాలనపౌకర్యమునకై గోదావరీతీరమునం గుంతలదేశమునం బ్రతిష్టానము కల్పించుకొని యుందురు. అట్లు ప్రతిష్టానముఁ బడయుటచేతనే యా రాజధానికిఁ బ్రతిష్టాన మని పేరయ్యెను. జాతక కథలు, పద్మ, కూర్మ, లింగ, భవిష్య పురాణములు, రామాయణోత్తరకాండము, కథాసరిత్సాగరము, మహాభారతము, విక్రమోర్వశీయము, ప్రతిష్టానమును ప్రశంసించుచున్నవి. ప్రతిష్టాననామము సాతవాహనరాజకల్పిత మని నానమ్మకము. ప్రతిష్టానమనురాజధానీనామమే యంధ్రభృత్యులుగా నున్న వా రంధ్రులగుటను, అది క్రొత్తగా నెలకొల్పCబడిన రాజధానియగుటను సూచించుచున్నది. ప్రతిష్టానమున నుండఁగా వీరు శకరాజులచేఁ గొంత