పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

2

మీఁగడ తఱకలు

 తానూప విదర్భాక రావంతి రాజస్య, వింధ్య ఋక్షవత పారియాత్ర సహ్య కృష్ణగిరి మఞ్చ శ్రీస్థాన మలయ మహేన్ద్ర శ్వేతగిరి చకోర పర్వత పతేః[1]. భాండారకర పండితుcడు, బూలరు పండితుcడు, భగవాన్‌లాల్, ఇంద్రాజీ పండితుండు మొదలగువారు పలుమార్లు పయి శాసనమును బరిశోధించి ప్రకటించిరట! ఇందులో బేర్కొనఁబడిన దేశములను బర్వతములను, వారు గుర్తించిరి. కాని యూయెల్లరకుcగూడ, ముళక దేశమేదో తెలియరాలేదట! ఒకరు ముళక మును 'ముండ్లక మునుగా సంస్కరింపవలె ననిరట! ఇంకొకరు సంస్కరింపకుండనే, ముళకు' లే 'ముండకు' లగుదు రనుట కాధారములఁ జూపిరట! ఈ తలపోఁతలలో మునిఁగి యాముళకదేశ మేదో వారు గుర్తింపcజాలక పోయిరి.

ఈ తలపోఁతలలోఁగూడఁగొంత వింత విషయ మున్నది. అది కడపటం దెలుపదును పయిశాసనమునఁ బేర్కొనఁబడిన ముళకదేశము నేఁడు ములికినాఁ డనఁబడు దేశమే యని నేను నిశ్చయించుచున్నాం డను. నేఁటి యంధ్రదేశము ప్రాచీనకాలమున వేంగీదేశముగాను ముళక దేశముగాను బేర్వెలసి యుండెను. కడప, కరూలు, బళ్లారి, నైజామురాజ్యములోC గొంత, యూనాఁడు ములకనాడుగా నుండెను.

  1. 1. శ్రీభావరాజువెంకటకృష్ణరావు పంతులుగారు, జయంతి 2వ సంచికలో నంధ్రాక్షరములలో సంస్కృతచ్ఛాయాంధ్ర వివరణసహితముగా నీశాసనముఁ బ్రకటించిరి. ఈ పూన్కి మిక్కిలి శాఘ్యము. కడముట్ట నిర్వహింతురు గాకని కోరుచున్నాను. ఇప్పడు ప్రకటించిన శాసనముల సంస్కృతచ్ఛాయలోఁ ప్రబలమయిన ప్రమాదము లున్నవి. "అపరాజిత విజయపతాక సతుజన దుపధసనీయ పరివరస" అను దానికి "అపరాజిత విజయ పతాకస్య శత్రుజన దుష్పధ నియమనస్య పురవరస్య" అని ఛాయ వ్రాయంబడినది. "అపరాజిత విజయవితాక శత్రుజన దుప్రృధర్షణీయ పురవరస్య" అని యుండవలెను. ఇట్టి వింకను గలవు.