Jump to content

పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

200 కవిత్వతత్త్వ విచారము దనకు వచ్చిన నెంతయు దైన్యమొంది యవ్విరాటుని సభఁజేర నరిగి నిలిచి. (છ. 2, 8, 138) కీచకుండు ద్రౌపదీ సమక్షంబునఁ జేయు బాలిశచేష్టలు దుర్విలాపంబులు నెంత సహజములు ! చూడుఁడు : సీ. ఎవ్వనితోనైన నెలుఁగెత్తి యొక్కింత పనిలేని వెంగలి పలుకుఁ బలుకు మట్టియ లొండొంటి బిటుదాఁకఁగ నేల నందంద మునిగాళ్ళ నప్పంచుఁ గడువికారంబుగా నొడలెల్ల విఱుచుచు మలఁగి రిత్తకుర్విత్త సెలఁగి నవ్వఁ దాళంబుగాఁ గరతలమునఁ బెలుచఁగం బంబు వేయుచు వెడపాటఁ బాడు మలయు నంతంతఁ జేరువ(బొలయు నింతి దన్నుఁ జూడమి కెంతయుఁ దల్లడిల్లు నిక్కడక్కడ వఁడుఁ దగు లినుమడింపఁ జూచు నత్తన్విఁ జొరిఁ బొరిఁ గీచకుండు. (ಆ. 2, ಏ.250) కీచకుని పశ్చాత్తాపకరమగు మహావస్థ : సీ , వామాక్షిరుచిర లావణ్యంబు భావించుఁ దన్వంగి రూపు చిత్తమున నిలుపుఁ గంబుకంథర చెన్నకైవడిఁ దలపోయు నంగన సౌకుమార్యముఁ దలంచు భామిని సహజ విభ్రమమెదఁ గీలించుఁ బడఁతి చెయ్వులు మదిఁ బట్టుకొలువు మానిని గరువంపు మాట పొందూహించు దళితాబ్దముఖి తిన్నఁదనము మెచ్చు నడరి కోర్కులు చిట్టుముట్టాడ వెడఁగు పడిన యుల్లంబు పట్టునఁ బఱుపఁ దనకు వశముగాకున్న నెంతయు వంతనొందుఁ జింతయెనకంబు వడిగొని చిక్కువఅుప. (ఆ. 2, ప. 258)