పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

159


అయ్యా! మీరు ప్రార్ధింపుఁడు. వచ్చినది తిండిగింజలకై-ఇంట, ఊర, అందఱు చచ్చుచున్నారు. వారికి నేఁటికి వలసిన బియ్యము, పప్పువగైరాపదార్ధములు కావలెను" అనెను, పండ్లు రాలినట్లు బియ్యపుమూటలు, పప్పులు వగైరాల మూటలు రాలెను. తనవంతు గైకొని యూరివారిని బంపుదు నని కాళ్లు కాలకుండుటకుఁ గూడఁ బ్రార్ధింపుఁ డని భక్తుని వేఁడి యాతఁ డింటికిఁ బర్వెత్తెను.

ముగ్గు రున్నారు. ఇదేదో ముసలిబ్రాహ్మణుని మంత్రమహిమ. మంత్రాలకుఁ జింతకాయలు రాలునా యన్నమాట తలక్రిందైనది. ఉచ్చిష్టగణపతిమంత్రమో యట్టి దింకేదో యీతcడు జపించుచున్నాఁడు. అట్టి క్షుద్రదైవత లిట్టి ఫలములు కూర్పఁగలవు. మహామంత్రములు పరదేవతలు పరలోకమున ఫలప్రాప్తిని కలిగించునే కాని తుచ్చమైనయిహసుఖముల నీయవు. ఏమైనఁ గానిమ్ము ఇప్పుడుచచ్చుచున్నాము గాన కోరకతప్పదు. అయ్యా! మాయూరికరవు తీరుదాఁక నూర నందఱికిఁ గావలసినయాహార మాయిండ్లనే వేయునట్లు మీ దేవతనో, దయ్యమునో ప్రార్ధింపుఁడు అనెను. భక్తుఁడు ప్రార్థించెను. ఆతఁడు మరల ననెను. ఏమో! యిండ్లకడ లభించియుండ వచ్చును. నా కిక్కడఁ గడుపార మంచి పండ్లు పాలు తిండ్లు దొరకవలెను. అవి తిని నే నింటికి వెళ్లుదు ననెను. వానికోరిక లభించెను. ఆరగించి వాc డింటి కరిగెను.

ఇద్ద ఱున్నారు ! ఒకఁడు మీభక్తికి మెచ్చి కల్పవృక్ష మిక్కడ వెలసినట్లున్నది. ఏమి కోరవలెనో తెలియఁజాలకున్నాను. నా కేమి కావలెనో వాని నన్నిటిని మీరే యీకల్పవృక్షముచే నిప్పింపుఁడు అనెను. భక్తుఁడు ప్రార్థించెను. కాని చెట్టునుండి యేవియు రాల వయ్యెను. ఏల రాలకున్నవో బదులు చెప్పు మని భక్తుఁ డావృక్షమును వేఁడెను. చెట్టు గజగజ వణఁక సాఁగెను. కొంత కిట్లు చెట్టు నుండి బదులువచ్చెను. ఇంత దాఁక నేను నన్నుఁ గోరినవారికి వలసినవస్తువులనే యియ్యఁ గల్లుచుంటిని గాన ప్రశ్నములకు బదు లెఱుఁగుట పలుకుట యెఱుఁ