పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

మీఁగడ తఱకలు

ఈతఁడు శ్రీహర్షనైషధమునకు వార్ధకమున వ్యాఖ్య గావింప నారంభించెను. జీవితసంశయముచేఁ దొందరతొందరగా రచించుటచేత నావ్యాఖ్య యపర్యాప్తముగా నుండెను. అది చూచి యొకపండితుఁ డింత లఘువుగా రచించుచున్నా రేమని యడుగఁగా "మాఫేు మేఫేు గతం వయః (మాఘమున, మేఘసందేశమున వయస్సు కడచెను.) అని పెద్దిభట్టు బదులు చెప్పెను. ఇట్టికథలు మఱికొన్ని యున్నవి.

ఈతఁడు విద్యానాథమహాకవికృతి యగుప్రతాపరుద్రయశోభూషణ మనునలంకారశాస్రగ్రంధమునకు వ్యాఖ్యాత. పెద్దిభట్టు మల్లినాథునకుఁ దనుజుఁ డని యీతఁడు తనగ్రంథమందుఁ జెప్పినాఁడు. చంపూరామాయణ వ్యాఖ్యానమునందు జనశ్రుతియందు ననుజుఁ డని యున్నది. ప్రతారుపద్రీయవ్యాఖ్యానమునం దున్నవిధము లేఖకాదిదోష జనితము కానిచో నదియే మనకు విశ్వాస్యతరము. ప్రతాపరుద్రీయవ్యాఖ్యాన పీఠికలోని శ్లోకము లివి. "వాణీం కాణభుజీమ్" - అన్నశ్లోకము తర్వాత

శ్లో!! త్రిస్కంధశాస్త్రజలధిం చుళుకీకురుతే స్మ యః
     తస్య శ్రీమల్లినాథస్య తనయో౽జని తాదృశః
     కోలచల పెద్దయార్యః ప్రమాణపదవాక్యపారదృశ్వా యః
     వ్యాఖ్యాతనిఖిలశాస్త్రః ప్రబంధకర్తాచ సర్వవిద్యాసు।

     తస్యానుజన్మా తదనుగ్రహాప్తవిద్యానవద్యో వినయావనమ్రః
     స్వామీ విపశ్చి ద్వితనోతి టీకాం ప్రతాపరుద్రీయరహస్య భేత్రీం

ఈ శ్లోకములు రఘువంశాది వ్యాఖ్యాత పెద్దిభట్టారకుఁడే యనునర్ధమును ధ్వనించుచున్నవి.

కుమారస్వామి సోమపీధికుమారుఁడు మహాదేవుఁడు. మహాదేవుని కుమారుcడు శంభువు. ఈతఁ డనేకయజ్ఞములు చేసెను. శంభుపుత్రుఁడు భాస్కరుఁడు. భాస్కరుని పుత్రుఁడు నాగేశ్వరయజ్వ ఈతcడు పుత్రులు నలుగురు - పౌత్రులు నలుగురు - అల్లుండ్రు నలుగురు - దౌహిత్రులు