పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

మీఁగడ తఱకలు


సమర్థము లయినవ్యాఖ్యలు రచింపఁబూనువానికి ప్రాచీనము లగుసర్వ విద్యలందును సంపూర్ణ పరిజ్ఞానము కావలసియుండును. కణాదగౌతమ తర్కములందు - పూర్వోత్తరమీమాంసలందు - వ్యాకరణమందు - సాంఖ్యయోగములందు - జ్యౌతిషమందు - నింక నితరవిద్యలందు - మల్లినాథుఁడు మహాపండితుఁడు, పదవాక్యప్రమాణపారావారపారీణుఁ డని - మహోపాధ్యాయుఁ డని-యాయన బిరుదులు. "కోశవా నాచార్య" అన్నట్లుగా నెన్నివిద్య లభ్యసించినను బ్రసక్తి కల్గినప్పుడు పరిశోధించుటకుఁ దగినంత గ్రంథసంచయముకూడ నుండినఁగాని సర్వంకష మగు వైదుష్యము సమకూడదు. మల్లినాథుఁడు తనగ్రంథములందు ననేక ప్రాచీనగ్రంథముల నుదాహరించెను. అన్నిగ్రంథముల నాతఁ డెట్లు సంపాదించెనో యాశ్చర్యావహముగా నున్నది. పూర్వులు పరంపరగా గొప్పవిద్వాంసు లగుటచేత వారువా రార్జించిన గ్రంథసంచయము కొంత యింటనే యీయనకు లభించియుండును. అది గాక కాకతిరుద్ర సర్వజ్ఞసింగభూపాలురసంస్థానములతో సంబంధ ముండుటచేత నక్కడి సరస్వతీభండారములును దొరకియుండును. ఈయన తనవ్యాఖ్యలం దుదాహరించిన గ్రంథము లనేకము లిపుడు లభించుట లేదు. కొన్ని యిట్టివనికూడఁ దెలియరాకయున్నవి. ఉదాహరణముగా నొకటిరెండు తెల్పెదను. సంగీతశాస్త్రవిషయములు వచ్చినప్పు డీయన వ్యాఖ్యానములందు 'తధా చ మతంగః’ అని యుదాహరించినాcడు. తెలియక ముద్రాపకులు కొందఱు 'మాతంగః' అని ముద్రించిరి. మతంగుఁడో మాతంగుఁడో సంగీతశాస్రమున నేమిగ్రంథము రచించెనో నేఁ డెవ్వరికిని దెలియ రాకుండెను. ఈ నడుమ శ్రీమానవల్లి రామకృష్ణకవి, ఎం.ఏ. గారు తంజావూరి రఘునాథరాయని సంగీతసుధలో "గ్రంథం బృహద్దేశ్యభిధం మతంగముని ప్రణీతం నిపుణం విలోక్య" అని యుండుటను బరిశీలించి తిరువాన్కూరు మహారాజపుస్తకశాలవా రిటీవల సంపాదించినబృహద్దేశి గ్రంథభాగము మల్లినాథుఁ డుదాహరించినమతంగకృతగ్రంథముగా