మీఁగడ తఱకలు
141
రచియించెను. పీఠికాశ్లోకములను బట్టి చూడఁగా నాతఁడు మనయెఱుకలో నున్నమల్లినాథసూరి నాధారపఱుచుకొని ప్రధానముగా నీ వ్యాసము వ్రాయుచున్నాను. ఆశ్లోకము లివి:
కొలచెల్మాన్వయాబ్దీందు ర్మల్లినాథో మహాయశాః
శతావధానవిఖ్యాతో వీరరుద్రాభివర్షితః
మల్లినాథాత్మజ శ్శ్రీమాన్ కపర్దీమంత్రకోవిదః
అఖిలశ్రౌతకల్పస్య కారికావృత్తి మాతనోత్
కపర్దితనయో ధీమాన్ మల్లినాథో౽గ్రజ స్స్మృతః
ద్వితీయ స్తనయో ధీమాన్ పెద్దిభట్టో మహోదయః
మహోపాధ్యాయ ఆఖ్యాత స్సర్వ దేశేషు సర్వతః
మాతులేయక్రతౌ (కృతౌ) దివ్యే సర్వజ్ఞే నాభివర్షితః
గణాధిపప్రసాదేన ప్రోచే మంత్రవరాన్ బహూన్
నైషధజ్యౌతిషాదీనాం వ్యాఖ్యాతా౽ భూ జ్జగద్గురుః
పెద్దిభట్టసుత శ్శ్రీమాన్ కుమారస్వామిసంజ్ఞకః
ప్రతాపరుద్రీయాఖ్యానవ్యాఖ్యాతా విద్వదగ్రిమః
తనయా స్తస్య చత్వారో మహాదేవ స్తదగ్రజః
మహాదేవాత్మజ శ్శంభు స్సప్తక్రతుభి రిష్టవాన్
తతో విశ్వజితం కృత్వా యజ్ఞం సర్వస్వదక్షిణమ్
శంభుయజ్వాత్మభూ ర్దీమాన్ భాస్కరో భాస్కరప్రభః
శ్రీనాగేశ్వరయజ్వాఖ్యా భాస్కర స్యాత్మసంభవః
పుత్రాః పౌత్రా శ్చ దౌహిత్రాః చత్వారో వేదవేదినః
జామాతరో౽పి చత్వార ఏతై ర్నిర్వర్తితాధ్వరః
సర్వతో ముఖపద్మానై స్సర్వక్రతుభి రిష్టవాన్
తస్యాత్మజః కొండుభట్టో ద్వితీయో వేదవిత్కవి:
శ్రీనాగేశ్వరయజ్వాఖ్యః కొండుభట్టసుత స్సుధీః
నరసక్కాఖ్యవధ్వాశ్చ శ్రీనాగేశ్వరయజ్వనః
నారాయణేన పుత్త్రేణ కొలచెల్మాన్వయేందునా
చంపురామాయణాఖ్యస్య ప్రబంధ స్యాఘహారిణః
వికృతిః క్రియతే ప్రేమ్ణా యథామతి సమాసతః