పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

 పలుకుతూ, శ్రీకార్యపరులైనవారి కందరికీ మాకృతజ్ఞతాభివందనా లర్పిస్తున్నాము. పాలలో పంచదారవలె దేవస్థానంలో శ్రీవేటూరిప్రభాకరశాస్త్రి స్మారక ట్రస్టు సంలీనమయింది. శ్రీప్రభాకరుల ఆశయం నెరవేరినట్లే భావిస్తున్నాము. వా రిలా భావన చేశారు.

"కరకర పల్కులన్ బిరుసుకల్గిన
           శర్కర నన్ను బాగుగా
 గరచి పొరంటి కొంటివి నిగన్నిగ
           మీగడపాల వీవు, ని
 ల్వరమున నాకు మార్దవము వచ్చెను,
           నీకు ఘనత్వమబ్బె, ని
 ర్వురము రసాయనం బగుట పోలదె
          యుర్వికి గ్రొత్తకోవగాన్"

డా. వేటూరి ఆనందమూర్తి

శ్రీ వేటూరిప్రభాకరశాస్త్రి స్మారకట్రస్టు పూర్వాధ్యక్షుడు.

హైదరాబాద్

29. 01. 08