పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

మీఁగడ తఱకలు

ఆయతకీర్తిధౌతహరిదంచలు డంజనలక్షణాభిధో
పాయదృఢప్రయోగపరిపాటి గృతుల్ రఘునాథభోజభూ
నాయకు డందుగాక విగుణస్ఫుటదోషము లౌ ఘుణాక్షర
న్యాయజడప్రబంధముల నందు మనం గలనైన నందునే

స్వయముక్తాత్మకృతిస్తుతుల్ జడులు భాషామంజరిన్ లింగని
ర్ణయమున్ గొంత సమాసచక్రము క్రియల్ నైఘంటుకాఖ్యల్ నిర
న్వయతం గూర్చి కవిత్వమంచు సభలన్ వర్ణింప విద్వత్కవి
ప్రియమౌ నాపదవాక్యమానసువచ శ్శ్రీమత్కృతుల్ దక్కఁగాన్
                                                      -నైషధపారిజాతీయము.

కావ్యములలో నాశ్వాసాద్యంతపద్యము లున్నను వానిని బాఠకులు, శ్రోతలు నంతగా బాటించి చదువుట, వినుట యుండదు. ఈగ్రంథమున నా కవి చవిగొల్పుచు జదువను, వినిపింపను సముత్సాహపఱచుచుండును.

కృష్ణాధ్వరి రచించినరఘునాథభూపాలీయాది గ్రంథములయిదును సంస్కృతగ్రంథములు. అందు రఘునాథభూపాలీయ మలంకారశాస్త్రగ్రంథము. దాని వ్యాఖ్యాన మొక యతీశ్వరుఁ డానాఁడే రచించినాఁడు. కడమగ్రంథము లిప్పుడు గానరావు. సంస్కృతమున గొప్పగ్రంథకర్త యగుకృష్ణాధ్వరి రఘునాథరాయఁ డాంధ్రకవిత నధికముగా నభిమానించునని యాతని వినోదపఱుచుటకై పరమోత్సుకతతోఁ బ్రయత్నించి యతి ప్రౌఢముగా నాంధ్రకవితారచన నలవఱుచుకొని యీగ్రంథము రచించినాఁడు. నైషధపారిజాతీయ మాముక్తమాల్యదరచనమును దలఁ పించుచు గూఢప్రౌఢశబ్దార్ధశ్లేషాలంకారచిత్రితమై యొప్పారుచున్నది. రాఘవ పాండవీయము, హరిశ్చంద్రనలోపాఖ్యానము నీగ్రంథమునకు మేలుబంతులే యయినను నా గ్రంథముల నీతఁడు గ్రంథరచనోపక్రమమున మాత్రమే యనుకరించె ననవచ్చును. కవి తానే దీనిని వ్యాఖ్యానించి యుండిన బాగుగా నుండెడిది. పెక్కేండ్లకు ముందే యథామాతృకముగా