పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/146

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మీఁగడ తఱకలు

127

తంజావూరిలో రఘునాథనాయని విద్యావినోదము భోజమహారాజు విద్యావినోదమును, గృష్ణదేవరాయనివిద్యావినోదమును దలపించనంతటిది. స్వయము రఘునాథరాయఁడు భోజునంత మహావిద్వాంసుఁడు ఆతని కుమారుఁడు విజయరాఘవనాయకుఁడు మహారసికుఁడు, కవి, మహాదాత, గాయకుcడు, పరమవైష్ణవుఁడు.

రాజసభలో నారితేరిన కవిచౌడప్ప రఘునాథరాయని రాజసభలో

"నేరుతు నని మాటాడను,
వారిజభవునంతవాని వశమా తంజా
వూరి రఘునాథరాయని
గారి సభను గుందవరపుఁ గవిచౌడప్పా!"

"తముఁ దామె వత్తు రర్థులు,
క్రమ మెఱిగినదాతకడకు రమ్మన్నారా
కమలంబు లున్నచోటికి
భ్రమరంబుల నచ్యుతేంద్రు రఘునాథనృపా!"

అనెను. ఈతఁడు విజయరాఘవనాయనిరసికతను మెచ్చి యాతనిపై గొన్నిపదముల రచించెను. అవి శృంగారరసగుళికలు.

రఘునాథనాయకఁడు సంస్కృతమునఁగూడ గొప్పవిద్వాంసుఁడు. యజ్ఞనారాయణదీక్షితు నంతవానికి కావ్యాలంకృతి నాటకాది సాహిత్య విద్యలో గురుత్వము నెఱపినవాఁడు, అనేకులచే సంస్కృతగ్రంథములఁ గృతు లందినవాఁడు, తన చరిత్రమునే యనేకులు, ఒకరే యనేకవిధముల రచింపగా విని తనిసినవాcడు నయినను దాను కవీశ్వరుఁడయి సంస్కృతమునకంటెఁ దెలుఁగుననే పలుగ్రంథములను రచించెను. అందు రామాయణభాగము, వాల్మీకిచరిత్ర, నలచరిత్ర ముద్రితము లయి యున్నవి.

రఘునాథరాయఁడు సంగీతమున గొప్ప విద్వాంసుc డగుటచే నందుఁగూడ గొప్పగ్రంథము రచించెను. రచింపించెను. రఘునాథనాయని సంగీతసుధ, వెంకటమఖిచతుర్దండిప్రకాశిక నాఁటి సంస్కృతగ్రంథములు,