పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/143

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

మీఁగడ తఱకలు


నిరపరాధులఁ జంపి నెత్తురు వారించcగాను
తెరల కెట్లుండిరో దిక్పాలులు
విరసవర్తను లుండే విపరీతకాలమున
గురువాలుం గపటాలే కలికాలమహిమా!!

ఉపమించి దంపతులు వొకరొకరినిం జూడ
చపలదుఃఖములతో సమయగాను
తపములు జపములు ధర్మము లెం దణఁగెనో
కపురుంబాపాలు నిండె కలికాలమహిమా!!

తలలు వట్టీడువఁగాను తల్లులు బిడ్డల వేయ
తలపె ట్టుండెనో యంతర్యామికి
మలసి ముక్కులు గోయ మరుఁ డెట్టు వోరిచెనొ
కలకలే ఘనమాయఁ గలికాలమహిమా!!

దీనతలోఁ బడి గుండెదిగు లసురుసురులు
వాని నెట్లు లోcగొనెనో వాయుదేవుండు
గూను వంచి తల్లి చూడఁ గొడుకుఁ గుత్తికఁ గోయc
గానంబడె నింతేసి కలికాలమహిమా!!

పలుమారు , నమ్మించి ప్రాణములు గొనగాను
యిలఁ దమలోఁ బ్రాణా లెట్లుండెనో
నెలవై శ్రీ వెంకటేశ నీవే యెరుంగుదువు
కలుషమే ఘనమాయఁ గలికాలమహిమా!!

(అన్నమాచార్యుల అధ్యాత్మసంకీర్తనములు 373 టేకు 1వ పాట)

క్రీ. 1500 నుండి 1565 దాఁక నష్టదిగ్రాయభయంకరుఁడయిన కృష్ణదేవరాయఁడు మొదలగురాజులు దక్షిణాపథమును సురక్షితపఱిచి భాగ్యలక్ష్మిని, సాహిత్యసరస్వతిని చాలఁగ సంవర్ధిల్లఁ జేసిరి, గాని విద్యానగరవినాశము తరువాత అంధ్రరాజ్య లక్ష్మి, ఆంధ్రసాహిత్య సరస్వతి, దక్షిణదేశమును అనగా అరవదేశము నధికముగ నాశ్రయింపవలసెను. కారణ మాదేశము రాజ్యోపప్లవము, దౌర్భాగ్యము లేక రాజన్వంతముగా