పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదికృతజ్ఞతలు

బ్రహ్మశ్రీ వేటూరిప్రభాకరశాస్త్రిగారి సాహిత్యవ్యాసాలు కొన్ని 1951 లో శ్రీప్రభాకర పరిశోధకమండలి ప్రచురణ (సంఖ్య 3) గా 'మీగడతఱకలు' పేర అచ్చుపడి విశ్వవిద్యాలయాలలో పాఠ్యగ్రంథంగా విశేషవ్యాప్తిగాంచినది. శ్రీశాస్త్రిగారినిర్యాణానంతరం ఈ గ్రంథం మొదట తిరుపతిలోనే ముద్రితమైంది. ఇప్పుడు దీనిని తిరుమల తిరుపతి దేవస్థానము పాలకమండలివారి తీర్మానముసంఖ్య 269, తేది. 25.07.2007 మేరకు రూపుదిద్దుకొన్న శ్రీవేటూరిప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠంవారు శ్రీప్రభాకర సంపూర్ణగ్రంధావళిప్రకటనకు పూనుకోవడము భాషాసాహిత్యాభిమాను లందరూ ఆనందించే విషయం. పండితపాఠకలోకాన్ని విశేషంగా ఆకర్షించిన మీగడతఱకలచవిని అందుకోండి.

ఇదే క్రమంలో శ్రీప్రభాకరశాస్త్రిగారివాజ్మయరచనలన్నీ తిరుమల తిరుపతి దేవస్థానంవారిగ్రంథమాలలో వడివడిగా వెల్లడి కాగలవు. అది తెలుగు భాషామతల్లి చేసుకొన్న పుణ్యవిశేషఫలమే కావలెను. ఎంతో అభిమానంతో ఇంతటి కార్యభారాన్ని స్వీకరించి తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు చేసినంత సంరంభంతో ఈ సారస్వతయజ్ఞాన్ని నిర్వహించడం మరీ విశేషం. అందుకు తెలుగుసాహిత్యాభిమానుల పక్షాన స్వామివారికి జేజేలు