పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/130

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

111

ఇఁకఁ గవివిషయమును విడిచి ప్రస్తుతగ్రంథమును గైకొందును. శైవారాధ్యులలో నొక్కఁ డయినయుద్భటారాధ్యుల చరిత్ర మిందు వర్ణిత మయినది.

పాల్కురికి సోమనాథకవి రచియించిన బసవపురాణములో సప్తమాశ్వాసమున నీయుద్భటుని చరిత్రము వర్ణితమైనది. ఆకథనే మనకవి ప్రపంచించి ప్రబంధముచేసినాఁడు. తెలుఁగున మలికార్డున పండితా రాధ్యుఁడును, నన్నిచోడఁడును నుద్భటుని స్తుతించిరి.

క|| హరలీలా స్తవరచనా
     స్థిరనిరుపమభ క్తిఁ దనదుదేహముతోడన్
     సురుచిరవిమానమున నీ
     పురమున కుద్భటుఁడు ప్రీతిఁ బోవఁడె రుద్రా!
                                            -శివతత్త్వ సారము

క|| క్రమమున నుద్భటుఁడు గవి
     త్వము మెఱయఁ గుమారసంభవము, సాలంకా
     రము, గూఢవస్తుమయ కా
     వ్యముగా హరు (ర?) లీల, చెప్పి హరు మెప్పించెన్||
                                               -కుమారసంభవము,

పయిపద్యములబట్టి యుద్భటుఁడు హరలీల, కుమారసంభవము, అలంకారగ్రంథము (కావ్యాలంకారసంగ్రహము) రచించినాఁ డని తెలియనగుచున్నది. ఇందుఁ గావ్యాలంకార సంగ్రహ మొక్కటితక్కఁ దక్కిన విప్పుడు కానరాకున్నవి. అతని కుమారసంభవమునుండి కొందఱాలంకారికులు కొన్ని శ్లోకముల నుద్ధరించిరి. [1]ఉద్భటుఁడు కాశ్మీరరాజగు జయాపీడునిసభలో విద్యాపతిగా నుండెనని (క్రీ. 779 నుండి 813 వఱకు) రాజతరంగిణిలో నున్నది.

ఆంధ్రకవు లీతని శివకవులలోఁ బేర్కొనుట మనకథానాయకుఁ డీతఁడే యనుటకు సాధకముగాని యీకథలో నాగ్రంథముల స్మరణము

  1. నన్నిచోడని కుమారసంభవము పీఠిక చూడము.