పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/115

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

మీఁగడ తఱకలు


అందుకు సాధకములు

ఇందుమతీపరిణయ మని తెనాలిరామభద్రకవికృతి యొకటి కలదు. అందిట్లున్నది.

     .................కవితాఘనతామహు మత్సితామహున్
     రామయ రామకృష్ణకవిరాజుఁ దలంచి నుతించి మొక్కెదన్.

గీ|| తదనుసంభవమణిని సుదక్షిణాప
     రిణయముఖకావ్యరచనాధురీణు నాంధ్ర
     కవికదంబములోనఁ బ్రఖ్యాతి గన్న
     యన్నపకవీంద్రు ధీసాంద్రు నభినుతింతు.

సీ|| ప్రౌఢి మీ పెదతాత పాండురంగాదిస
                త్కృతులు చేసెను రామకృష్ణసుకవి
     యనుజుఁ డన్నప్ప మీపినతాత రచియించెఁ
                బరఁగ సుదక్షిణాపరిణయంబు
     మీతాత శ్రీగిరి చాతురీవిఖ్యాతి
                శ్రీశైలమాహాత్మ్యకృతి యొనర్చె
     కడిమి మీతండ్రి యిమ్మడి రామకృష్ణాఖ్యుఁ
                డనఁగీర్తి గనె సంస్కృతాంధ్రములను

గీ|| నౌర యనిపించె మీయన్న వీరరాఘ
     వాఖ్యకవి సర్వకవితామహత్త్వమునను
     ని న్ననూచానసంతాను నెన్నఁదరమె?
     ప్రాజ్ఞహృదయాబ్జరవి రామభద్రసుకవి!

__________________________________________________________________

  • ఇది తంజాపురపు సరస్వతీపుస్తక భాండాగారమునఁ గలదు. శ్రీమానవల్లి రామకృష్ణకవి, యం.ఎ. గారు దీనివిషయము 1914 సంవత్సరాది సంచికలో "తెనాలికవులు" అను వ్యాసమునఁ దెలిపినారు. వారే దీనిప్రతిని చెన్నపురి గవర్నమెంటు లైబ్రరికిని నొసంగినారు.