పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

83

శ్రీరామచంద్రమూర్తి చెట్టుచాటుననుండి వాలిమేనఁగాడనేసిన వాఁడి ములుకులకంటె నిక్కడ తార ప్రత్యక్షమై నిలుచుండి శ్రీరాముని యంతరంగము నుచ్చిపోవునట్టు ప్రయోగించిన పలుకుములుకులు క్రొవ్వాఁడి గలవి.

సుగ్రీవవిజయము వీరకరుణరసభరితము. స్త్రీ బాలపామరాదులు గూడఁ బఠింపఁ దగినది,

ఆ యక్షగానమున నీక్రింది దేశిరచన లున్నవి. త్రిపుట, జంపె, కుఱుచజంపె, అర్ధచంద్రికలు, ఆటతాళము, ఏకతాళము, ద్విపదలు, ధవళములు, ఏలలు, అర్ధచంద్రికలు త్రిపుటాదిరచనల ఖండరచనలు గాఁబోలును. ఇందలియర్ధచంద్రిక లెల్ల నొక్క తెఱఁగునడక గలవి గాక భిన్నగతులతో నున్నవి. సంగీతతాళ లక్షణము లెఱిఁగినవారు వాని ప్రభేదములు గుర్తింపవలెను.

కురవంజులు, యక్షగానములు నింకను మంచిరచనములు గలవి కొన్ని యున్నవి. అవి యేవేని సుగ్రీవవిజయమువలె సుముద్రితములైనచో నాంధ్రమధురకవితావిశేషములను సహృదయు లింక నధికముగా నాస్వాదింపఁగల్గుదురు.


  • * *