పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

మీఁగడ తఱకలు


హా సతీమణి ధర్మచారిణి హా గుణోన్నత జనకసుత ననుc
బాసిపోయితి వింతలోనే పద్మనయన
లేటిమాయలు మదిని దెలియఁగ లేక పాపపురక్కసునిచే
బోటి నిను గోల్పోతి నిక నాకేటి బ్రదుకు!

లలన నినుఁ గలనైన బాయఁగఁ గలన నీ విట లేక యుండినఁ
జలన మొుందెను నాదుహృదయము జలజనయన !

తరణికులమునఁ బుట్టి శరచాపముల బట్టి
తరుణిఁ గోల్పడుకంటె మరణమే మేలు
నను శౌర్యవంతుఁ డని తనపుత్రి నిడినట్టి
జనకవిభుఁ డీవార్త విని వగవకున్నె

నాయ మెఱుగక చంపితివి నరనాథ పాపము గట్టికొంటివి
బోయ వింతియె కాక నీ వొక భూమిపతివా?

శ్రీరామ శ్రీరామ జెఱగొన్న రావణుని
వారిధుల ముంచితిని వాలమునఁ జుట్టి
ఒకమాట నాకుఁ జెప్పక పోయితివి గాక
సకలదైత్యుల దున్మి జానకిని దేనె?

ఆలిఁ జెఱగొని పోయినట్టిదశాస్యుఁ డుండఁగ నిర్నిమిత్తము
వాలి నేటికిఁ జంపితివి రఘువంశతిలకా!
ఇట్టిసాహసకర్మ మెచటికి నేఁగె భరతుఁడు సీమ వెడలఁగఁ
గొట్టి రాజ్యము పుచ్చుకొన్నెడఁ గువలయేశా !
నాయ మేటికిఁ దప్పితివి రఘునాథ జానకితోడనే చెఱఁ
బోయెనే నీ రాజనీతియు భూరిమతియున్,