పుట:Matamu-Pathamu.pdf/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అని ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! మేము చెప్పునది దేవుళ్ళకు కూడ దేవుడైన దేవుని విూద విశ్వాసమును గురించి చెప్పాము. విూరు అడుగునది దేవుడు పుట్టించిన దేవతల భక్తిని గురించి. దేవతల భక్తి హిందూమతములో ఉన్నంతగా ఏ మతములో లేదు. దేవతాభక్తి 99 శాతము హిందూవులలోనే కలదని చెప్పవచ్చును. కానీ దేవుని విూద భక్తి కేవలము 2 శాతము కూడా లేదని చెప్పుచున్నాము. మిగత రెండు మతములలో దేవుని విూద భక్తి తప్ప దేవతల విూద భక్తి లేదనియే చెప్పవచ్చును. దేవుని గురించిన బోధలుగల తలమాణిక్యమైన గ్రంథములు మూడు మతములలో మూడు గలవు. అవి ఇస్లామ్‌మతములో పవిత్ర ఖురాన్‌, క్రైస్తవమతములో పరిశుద్ద బైబిలు, హిందూమతములో భగవద్గీత గలదు. ఇక్కడ గమనించదగిన విషయమేమంటే ఇస్లామ్‌ మతగ్రంథమైన ఖురాన్‌ ముందర పవిత్ర అను బిరుదు గలదు. అలాగే క్రైస్తవములోని బైబిలు ముందర పరిశుద్ద అను బిరుదు గలదు. అయితే ఒక హిందూమతములోని భగవద్గీతముందర ఏ బిరుదు లేదు. వెనుక పుట్టిన బోధలకు పవిత్ర అని, పరిశుద్ద అని బిరుదులు ఉండగా ముందు పుట్టిన భగవద్గీతకు మొదట బిరుదులేదా అని యోచిస్తే, గడచిన కాలములోనికి పోయిచూస్తే భగవద్గీతకు ముందు దాని విలువను తెలుపు బిరుదులుండెడివని తెలియుచున్నది. అంతే కాదు ఇంకా వెనక్కి వెళ్లిచూస్తే నేడు మనకు తెలియని ఎన్నో సత్యములైన రహస్యములు బయటపడుచున్నవి.

ఇప్పుడు ప్రచారములోనున్న భగవద్గీత భగవంతుడైన శ్రీకృష్ణుని చేత అర్జునునికి ద్వాపరయుగములో (ద్వాపరయోగములో) చెప్పబడినప్పటికి దానిని పూర్వమే సృష్ఠి ఆదిలోనే పరమాత్మ సూర్యునికి చెప్పియున్నాడు. దీనినిబట్టి భగవద్గీత సృష్ఠి ఆదిలోనే ఉన్నదని తెలియుచున్నది. సృష్ఠాది నుండి ఉన్న