పుట:Matamu-Pathamu.pdf/49

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

39. మతములలోని విధానమును, సిద్ధాంతములలోని సారమును, శాస్త్రములోని శాస్త్రీయతను వెతికి, ఉంటే చూపునది లేకుంటే ప్రశ్నించునది ఇందూ జ్ఞానవేదిక.

40. మనిషి ఒక్కడే, దేవుడు ఒక్కడే అయినపుడు ఇన్ని మతములు, ఇందరు దేవుళ్ళు ఎందుకని ప్రశ్నించునది ఇందూ జ్ఞానవేదిక.

41. మనుషులనుండి ‘మహాత్ముడు’, చెట్లనుండి ‘బదనిక’ బయటికి వచ్చునట్లు, అజ్ఞానులనుండియే ‘జ్ఞాని’ పుట్టగలడని తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

42.చెట్టుమీద తీగను భూమిలోని గడ్డ (దుంప)కనిపించు ఏ సంబంధము లేకుండ ఆధారమైనట్లు, భూమి మీద మనిషికి శూన్యములోని దేవుడు కనిపించని ఆధారమై ఉన్నాడని తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

43.వేరు మతములలోని అపార్థములకు నిజార్థమునిచ్చి జ్ఞానబోధ చేయునది ఇందూ జ్ఞానవేదిక.

44.ఐదున్నొకటి అయిన ఆరు శాస్త్రములలోని శాస్త్రబద్ధతను చూపించునది ఇందూ జ్ఞానవేదిక.

45.శాస్త్రముకాని విషయములు శాస్త్రములో కలిసియున్ననూ, వాటిని తీసివేసి శాస్త్రమునకు స్వచ్ఛతను చేకూర్చునది ఇందూ జ్ఞానవేదిక.

46.శాస్త్రమును గుర్తించలేక అశాస్త్రీయమనువారికి కళ్ళు తెరిపించి శాస్త్రములోని శాస్త్రీయతను తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

47.అజ్ఞానములోని అంధకారమును, జ్ఞానములోని ప్రకాశమును, విజ్ఞానములోని అనుభవమును వివరించి తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

48.సత్యమును ప్రకటించడము, అసత్యమును ఖండించడమును ముఖ్యకార్యముగా పెట్టుకొన్నది ఇందూ జ్ఞానవేదిక.

49. పూర్వమునుండి ఇపుడు లేకుండా పోయిన విజ్ఞానమును వివరించి తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

50.శరీరమునందు పిట్యూటరీ గ్లాండ్‌, మిగతా ఆరు గ్రంథులకు రాజైనట్లు, విశ్వమునందు బ్రహ్మవిద్యాశాస్త్రము మిగతా ఐదు శాస్త్రములకు రాజుగానున్నదని తెలుపునది ఇందూ జ్ఞానవేదిక.

51.ఆస్తికవాదులకు, నాస్తికవాదులకు హేతువాదులకు మొదలగు ఎవరికీ తెలియనివాడు దేవుడని తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

52.టెలివిజన్‌ను కనిపించు ఏ సంబంధము లేకుండా చేతిలో రిమోట్‌ నడిపించినట్లు, చెట్టుమీద తీగను కనిపించు ఏ సంబంధము లేకుండా భూమిలోని గడ్డ (దుంప) పెంచునట్లు, మనిషిని కనిపించు ఏ సంబంధము లేకుండా శూన్యములోని దేవుడు పోషించుచున్నాడని తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.