పుట:Matamu-Pathamu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50. స్వచ్ఛమైన తెల్లనిది జ్ఞానము. చిక్కనైన నల్లనిది అజ్ఞానము. తెల్లని దుస్తుల విూద పూర్తిగా నల్లని కోటును ధరించిన జడ్జి నేను జ్ఞానానికి జడ్జిని కాదు, అజ్ఞానానికి మాత్రమే అన్నట్లున్నది.

51. తెల్లని దుస్తులవిూద నల్లని చిన్న కోటును ధరించిన న్యాయవాదులైన లాయర్లుకానీ, నల్లని పెద్దకోటు ధరించిన న్యాయనిర్ణేతలైన జడ్జీలు కానీ, చట్టములో జ్ఞానమును, అజ్ఞానము కప్పియున్నదని ఇతరులకు తెలియునట్లు, ఆ విధముగా తెలుపు విూద నలుపును ధరించారను కొంటాము.

52. మాయకు రెండు బలమైన వలలు కలవు. ఆ వలలలో చేపలు పడవు మనుషులు మాత్రము పడుతారు. ఆ వలల పేర్లు ఒకటి మతము. రెండు కులము. మతము కల్గినవాడు, కులము కల్గినవాడు మాయ వలలోనివారే. మతాతీతుడు, కులాతీతుడు దేవుని వలయములోని వారే.

53. మతములేనివాడు దేవుని పథములోని వాడే! కులములేనివాడు జ్ఞానపథములోని వాడే!


అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యము కాదు,

సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యము కాదు.