పుట:Matamu-Pathamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

41. మనిషిని ద్వేషించవచ్చు, మతాన్ని ద్వేషించవచ్చు, దానివలన వచ్చే పాపము క్షమించబడుతుంది.

42. దేవున్నికానీ, దేవుని పథమునుగానీ ద్వేషిస్తే దానివలన వచ్చే పాపము యుగ యుగముల పర్యంతము క్షమించబడదు.

43. నీవు జడ్జివైతే నీకు చట్టము తెలుసు, కావున ప్రపంచ విషయములకు శిక్ష చెప్పవచ్చును. దేవుని విషయములకు శిక్షచెప్పవద్దు. ఎందుకనగా దేవుని చట్టము నీకు తెలియదు.

44. నీవు న్యాయ నిర్ణేతవైన జడ్జివైతే ప్రపంచ విషయములలో ఇది ఫలనా నేరమని గుర్తించగలవు. కానీ దేవుని విషయములలో ఇది ఫలనా నేరమని గుర్తించలేవు.

45. నీవు న్యాయ నిర్ణేతవైతే న్యాయాన్యాయములను మాత్రమే గుర్తించగలవు. కానీ ధర్మాధర్మములను గుర్తించలేవు.

46. నీవు జడ్జివైతే కేవలము న్యాయాధికారివే, కానీ ధర్మాధికారివి కాదని గుర్తుంచుకో!

47. నీవు జడ్జివైతే ఇహలోక సంబంధ న్యాయమును మాత్రము గుర్తించ గలవు. కానీ పరలోక సంబంధ ధర్మమును గుర్తించలేవు.

48. న్యాయశాస్త్రమును చదివితే నీవు జడ్జి కావచ్చును. కానీ యోగ శాస్త్రమును చదవనిదే ఎవరూ యోగి కాలేడు.

49. న్యాయాధిపతి అయిన జడ్జి మనుషులకు మాత్రము శిక్ష చెప్పగలడు. కానీ ధర్మాధిపతి అయిన దేవుడు న్యాయాధిపతులకు కూడ శిక్ష చెప్పగలడు.