Jump to content

పుట:Matamu-Pathamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చదివినా కాని ఎక్కడా వివరములేదు. అపుడు ఆరువందల అరువదియారును దేవుని సంఖ్యగా ప్రకటించిన వారిని కలిస్తే ఆ సంఖ్య వివరమేమైనా తెలుస్తుందేమోనని అనుకొన్నాము. తర్వాత వారిని కూడ కలిసి మాట్లాడము జరిగినది. వారిని కలిసి మాట్లాడిన వివరమంతా మేము వ్రాసిన "సృష్ఠికర్త కోడ్‌ 963, మాయ కోడ్‌ 666" అను గ్రంథములో పొందుపరిచాము. అక్కడ వారివద్ద సరియైన సమాధానము లేదని తెలిసిపోయినది. వారు 666 ను మాయ (సాతాన్‌) నంబరు అని ఒప్పుకుంటూనే దానిని దేవుని నంబరుగా చెప్పాలని ప్రయత్నించారు.

అపుడు ఆరువందల అరువది యారు మాయ నంబరని, అది దేవుని నంబరుకాదని వివరముగా చెప్పదలచిన మేము ప్రత్యేకమైన గ్రంథము వ్రాయవలసి వచ్చినది. ఆ గ్రంథములో దేవుని కోడ్‌ పలానా అని కూడ వివరించవలసి వచ్చినది. అ సందర్భములో మాయ మతగ్రంథములలో ఎలా చోటు చేసుకొన్నదో వివరించడములో బైబిలులోని ఒక ఘట్టమును తీసుకొని ఇది దేవుడు చెప్పినది కాదని చెప్పవలసివచ్చినది. బైబిలులోని ఆదికాండములోని మొదటి ఆధ్యాయము మొత్తము శాస్త్రబద్దముకాదని, కల్పించి మనుషులు చెప్పినది తప్ప దేవుడు చెప్పినది కాదని చెప్పడమైనది. బైబిలు ఆదికాండములోని సృష్ఠి విధానమును మేము ఖండించడము వలన కొంతమంది క్రైస్తవ సోదరులకు కొంత బాధకల్గినా విజ్ఞానముకల్గిన క్రైస్తవులంతా మా మాటను సమర్థించారు. అక్కడ మా మాటను కాదనుటకు ఏ దారిలేదు, కావున ఆ విషయమును గురించి క్రైస్తవ సోదరులు ఏమి మాట్లాడలేదు. మేము దేవుని జ్ఞానమును సమర్థిస్తూ, మాయ జ్ఞానమును విమర్శిస్తూ, గ్రంథము వ్రాసి దాదాపు పదివేల గ్రంథములను ఉచితముగా పంచాము. ఇది మాయ జ్ఞానము, ఇది దేవుని జ్ఞానము అని తెలియుటకు 20వేల