Jump to content

పుట:Matamu-Pathamu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను మాయజ్ఞానమును ఖండించి, దేవుని జ్ఞానమును వివరముగా చెప్పవలసి వచ్చినది. నేను ఒక దినము హైదరాబాద్‌ పట్టణములో ప్రయాణించుచున్నపుడు కారు అద్దమును దించేదానికి ప్రక్కకు చూచాము. అపుడు అక్కడ ఒక కాంపౌండు గోడవిూద పెద్ద పెద్ద అక్షరములతో వ్రాసియున్నది కనిపించినది. అక్కడ ఏమి వ్రాసియున్నదనగా! సృష్ఠికర్త కోడ్‌ 666 అని వ్రాసియున్నది. దానిని చూచిన మేము వెంటనే మా ప్రక్కనున్న వ్యక్తితో "ఎవరో ఇది తప్పుగా వ్రాసియున్నారు. దేవుని కోడ్‌ 963 అని ఉండవలయును. వారు వ్రాసినది మాయ నంబరు. మాయనంబరును దేవుని నంబరుగా వ్రాయడము తప్పు" అన్నాము. మరికొంత దూరము వెళ్ళిన తర్వాత ఒకవాల్‌పోస్టర్‌ కనిపించినది. దానివిూద కూడ సృష్ఠికర్తకోడ్‌ 666 అని వ్రాసియుండి దాని ప్రక్కన యోహన్‌ ప్రకటనల గ్రంథము 13-18 అని బ్రాకెట్‌లో వ్రాయబడియున్నది. అప్పుడు తెలిసినది ఇది బైబిలులోని వాక్యమని! తర్వాత ఇంటికివచ్చి బైబిలు తీసి యోహన్‌ ప్రకటనలను భాగములో 13వ అధ్యాయమున 18వ వాక్యమును చదివాము. అక్కడ కూడ అది దేవుని నంబరుగా లేదు. వెంటనే యోహన్‌ ప్రకటనల భాగములోని 22 అధ్యాయములన్నిటిని చదివాము అపుడది సాతాన్‌ (మాయ) నంబరు అని స్పష్టముగా అర్థమైనది. దానితో వారు గోడలవిూద వ్రాసినది పూర్తి తప్పు అని తెలిసిపోయినది. బైబిలులో ప్రకటనల గ్రంథము 13వ అధ్యాయము 18వ వాక్యము ఇలా కలదు. "బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అదియొక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య ఆరువందల ఆరువది యారు, ఇందులో జ్ఞానము కలదు." ఈ వాక్యము ప్రకారము అది దేవుని సంఖ్యకాదు అని తెలిసిపోతుంది. కానీ మాయ నంబరుగా చెప్పిన ఆరువందల అరువది యారు ఏ విధానముతో ఆ సంఖ్యను చెప్పారనునది అక్కడగానీ, మొత్తము అన్ని అధ్యాయములు