పుట:Matamu-Pathamu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలన హిందూమతమునకు ఇతర మతముల ముందర తల ఎత్తుకోవలసి వస్తుందో, తలదించుకోవలసి వస్తుందో విూరే యోచించుకోండి!

ఇంతవరకు ఇదంతయు వ్రాసిన మేము అందరు అనుకొన్నట్లు హిందూమతమునకు సంబంధించినవారమే. పైకి మేము హిందూమతములో ఉన్నప్పటికి లోపలికి ఇందూపథములో ఉన్నవారమే. మాకు తెలిసినట్లు మాది ఇందూపథమే అయినా మీకు తెలిసినట్లు మాది హిందూమతమేనని చెప్పవచ్చును. ఎవరేమనుకొనినా మాకు మతము ముఖ్యముకాదు పథమే ముఖ్యమైనది. అందువలన ఏ మతములోని జ్ఞానమునైన ఒప్పుకొంటాము, కానీ ఏ మతములోని కొద్ది అజ్ఞానమును కూడ ఒప్పుకోము. దేవుడు సర్వమానవులకు సంబంధించినవాడు. అట్లే దేవుని జ్ఞానము అందరికి సంబంధించినది. అందరికి సంబంధించిన జ్ఞానము ఏ మతములో ఉన్నా అది నీకు నాకు కూడ సంబంధించినదే అగును. అందువలన దైవజ్ఞానమును ఏ మతమునుండైన గ్రహించవచ్చును. అదే విధముగా దైవజ్ఞానమను పేరుతో మాయజ్ఞానము ఏ మతములో ఉన్నా దానిని పూర్తిగా ఖండించ వచ్చును. అజ్ఞానమును ఖండించవలసిన బాధ్యత అందరికి ఉన్నది. ఈ సూత్రము ప్రకారము దైవజ్ఞానము ఇటు హిందూమతములో ఉండినా, అటు క్రైస్తవమతములో ఉండినా నేను దానిని తప్పక ప్రశంసిస్తాను. అట్లే దైవజ్ఞానమునకు వ్యతిరేకమైన మాయజ్ఞానము ఇటు హిందూమతములో ఉండినా, అటు క్రైస్తవమతములో ఉండినా నేను దానిని తప్పక ఖండిస్తాను. ఇది మానైజము.

ఆ నేపధ్యములోనున్న మాకు క్రైస్తవమతములో దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖమైన మాయజ్ఞానము కనిపించినది. అప్పుడు నా బాధ్యత ప్రకారము