పుట:Matamu-Pathamu.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అయిపోతుంది. ఎందుకనగా ప్రపంచ సంబంధకర్మ పరిమితమైనది, దానిని పరిమిత కాలములో అనుభవిస్తే అయిపోతుంది. కానీ దేవుడు అపరిమిత మైనవాడు కావున దైవసంబంధముగ చేసుకొన్న కర్మ అపరిమితమైనది. మరియు దాని అనుభవము కూడ అపరిమిత కాలముండును. అందువలన పరిశుద్దాత్మను నిందించితే ఈ యుగమందైనను, రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదన్నారు. దేవుని నిందించినవాడు యుగయుగముల పర్యంతము పాపము అనుభవిస్తూనే ఉండవలయునని అర్థము కాదా! దేవున్ని దూషించిన మనిషి ఈ యుగమంతయు మరియు రాబోవు యుగములంతయు ఉండుననియేగా అర్థము. ఆ విధముగ ఎవడైన ఉన్నాడా? అని చూస్తే ఒకే మనిషి అనగా దేవున్ని దూషించినవాడు ఎవడూ నూరు సంవత్సరములకంటే ఎక్కువకాలము బ్రతుకలేదు. కానీ అక్కడ యుగ పర్యంతముండునను దేవుని మాట వ్యర్థము కాదుకదా! అంటే దేవుని వాక్కు ప్రకారము యుగయుగముల వరకు వాడుండుట సత్యమే. అది ఎలా అంటే నిందించినవాడు చస్తూ పుట్టుచు, జన్మలు పొందుచు, శరీరములు మారుచు దేవున్ని దూషించిన పాపమును అనుభవించుచుండును. ఇక్కడ మనిషికి జన్మలున్నాయంటేనే దేవుని మాట నెరవేరుతుంది. మనిషికి జన్మలులేవంటే దేవుని మాట అసత్యమౌతుంది. దేవుని మాటకు వ్యతిరేఖముగా మాయ మనిషికి జన్మలు లేవని మనుషుల చేతనే చెప్పిస్తుంది. అయినా జ్ఞానము ప్రకారము అది నిలువదు. జ్ఞానము ప్రకారము దేవున్ని దూషించిన మనిషి చిరకాలము భూమివిూద పాపమును అనుభవిస్తూనే ఉండుట సత్యము.

సాతాన్‌ మరియు సైతాన్‌ అను పేర్లతో చలామణి అగు మాయ చాలా గొప్పది. దానిని జయించుట దుస్సాధ్యమని స్వయముగ భగవంతుడే "మమమాయ దురత్యయా" అని భగవద్గీతలో చెప్పాడు. అందువలన మాయ