పుట:Matamu-Pathamu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవుని కుమారుడు మాత్రము భూమివిూద కొన్ని వేల సంవత్సరముకొక మారు పుట్టుచుండును. మాయప్రభావము వలన భూమివిూద అధర్మములు ఎక్కువైనపుడు దేవుని ధర్మము తెలియకుండ పోయినపుడు దేవుని సంకల్పముతో దేవుని అంశ భూమివిూద పుట్టును. అలా పుట్టినవాడు కూడ బయటికి మనిషిగానే ఉండును. ఇక మూడవవాడైన మనిషి సృష్ఠాదిలోనే పుట్టియున్నాడు. మాయమార్గములో నడుచు మనిషి భూమివిూద నివసించు స్థలమును, బంధువర్గమును కొన్ని సంవత్సరముల కొకమారు మరణము అను దానితో విడిపోతూ, పుట్టుక అనుదానితో క్రొత్త నివాసస్థలమును, క్రొత్తబంధువర్గమును పొందుచుండును. ఇదంతయు ఒక ఉద్యోగి ట్రాన్స్‌ఫర్‌ (బదిలి) అయి మరొక ఊరిలో ఉద్యోగము చేసినట్లు, ఒక జీవుడు ఒక శరీరమును వదిలి వేరొక శరీరమును పొంది అక్కడ క్రొత్త జీవితమును సాగించుచుండును. దీనినిబట్టి ఎల్లపుడు భూమివిూద ఉండువాడు మూడవవాడైన జీవుడు (మనిషి). మొదటివాడైన పరిశుద్దాత్మ అసలు పుట్టడు. రెండవవాడైన దేవుని కుమారుడు (భగవంతుడు) అవసరమొచ్చినపుడు కొన్ని వేలసంవత్సరములకొకసారి పుట్టుచుండునని తెలియుచున్నది. రెండవవాడైన భగవంతుడు లేక దేవుని కుమారుడు మనిషికి కర్మలు (పాపపుణ్యములు) అంటకుండుటకు మనిషి కర్మల నుండి బయటపడుటకు అవసరమైన దేవుని జ్ఞానమును తెలుపుటకు పుట్టుచుండగా, మనిషి మాత్రము పాపమును అనుభవించుటకు పుట్టుచుండును. కర్మను అనుభవించుచు క్రొత్తకర్మను మనిషి సంపాదించుకొనుచు, క్రొత్తదానిని అనుభవించుటకు, క్రొత్త జాగా, క్రొత్త బంధువులను, క్రొత్త శరీరముతో చేరుచున్నాడు. పాతకర్మను అనుభవిస్తూ క్రొత్తకర్మను ప్రపంచకార్యములలో ప్రపంచ సంబంధముగ సంపాదించు కొనుచున్నాడు. ప్రపంచ సంబంధముగ సంపాదించుకొన్న కర్మను అనుభవిస్తే