పుట:Matamu-Pathamu.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మతములలోను నాయకుడైయున్న దేవుడు సృష్ఠించినవే మతగ్రంథము (పథగ్రంథము) లైన భగవద్గీత, బైబిలు, ఖురాన్‌లు. దేవుడు తెలియజేసిన జ్ఞానసమాచారము ఆ మూడు గ్రంథములలో కలదు. కానీ దేవుడు తెలియజేసిన జ్ఞానమును కూడ మనుషులకు అర్థము కాకుండ చేయడమే మాయయొక్క పని తనము. గ్రంథములలో కూడ తన ఛాయను చూపుకోవడము మాయ యొక్క చాకచక్యము. ఉదాహరణకు భగవద్గీతను తీసుకొంటే దేవుడు చెప్పిన చాలా శ్లోకములను మాయ మనుషులకు అర్థము కాకుండ చేసినది. సంస్కృత శ్లోకములకు వివరము చెప్పిన స్వాముల చేతనే తప్పుడు వివరమును వ్రాయించింది. ఎక్కడాలేని స్వర్గ, నరక లోకములు ప్రత్యేకముగా ఉన్నవని నమ్మించింది. మొత్తము విూద దేవుడు చెప్పిన భావమును కేవలము ఐదు శాతము కూడ అర్థము కాకుండ చేసినది. చాలా చోట్ల భగవద్గీతలో దేవుడు చెప్పిన ఉద్దేశ్యమునకు వ్యతిరేఖ భావములను దేవుడే చెప్పినట్లు నమ్మించినది. అందువలన హిందూ మతములో భగవద్గీత ఇప్పటికి పూర్తి భావసహితముగా లేకుండ భావరహితముగా ఉన్నదనియే చెప్పవచ్చును.

ఇక బైబిలు విషయానికి వస్తే అందులో మాయ, దేవుని మాటలను మనుషుల మాటలను కలిపివేసినది. దేవుని మాటను మనుషుల మాటలను సమానముగా లెక్కించుకొనునట్లు చేసినది. ఇది ప్రత్యేకమైన దేవుని మాట కదాయని గుర్తించనట్లు మనుషుల మాటలను చొప్పించినది. బైబిలులోని అన్ని వాక్యములు ముఖ్యమేనన్నట్లు దానిలోని ఒక పొల్లు కూడ తీసి వేయకూడదని మనుషులను శాసించినది. అందువలన క్రైస్తవులు బైబిలులోని దేవుని వాక్యములను మాత్రము గుర్తించక ప్రతివాక్యము ముఖ్యమేనను కొంటున్నారు. తమకు తెలియకనే దేవుని వాక్యమునకు వ్యతిరేఖమైన భావములను తమలో పెట్టుకొనుచున్నారు. దైవము చెప్పిన భావమునకు