పుట:Matamu-Pathamu.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వ్రాసిన గ్రంథములే చదవాలి అని తమ వర్గమువారికి బోధించను మొదలుపెట్టారు. హిందూమతములో అద్వైతము, విశిష్ఠాద్వైతము, ద్వైతము అను చీలికలుండడమేకాక అచల సమాజమనీ, బ్రహ్మకుమారి సమాజమనీ, సిద్దయోగ సమాజమనీ, పిరమిడ్‌ సమాజమనీ చాలా రకముల చీలికలు గలవు. హిందూమతములో వారివారి సమాజమును బలపరచుకొనేదానికి, వారి సమాజములోనివారు ఇతర సమాజములోనికి పోతారేమోనని భయముతో ఇందూమతములోనే ఇతరులు వ్రాసిన పుస్తకములు చదువకూడదని తాము వ్రాసిన పుస్తకములు మాత్రమే చదువవలెనని ఆంక్షలు పెట్టియుందురు. ఇదెలా ఉందంటే తాను అందవిహీనుడైయున్నవాడు తన భార్య తనకంటే అందముగా ఉన్నవాడిని చూస్తే తనను ఎక్కడ వదిలిపెట్టిపోతుందోనను భయముతో నీవు ఇతరుల వైపు చూడద్దు అని తన భార్యను ఆజ్ఞాపించినట్లు కొందరు గురువులు, స్వాములు తమ భక్తులకు, శిష్యులకు ఇతర పుస్తకములు చదవద్దనీ, ఇతర బోధలు వినవద్దని ఆజ్ఞాపించుచున్నారు. ఇలాంటి నా మతము అను సంకుచిత భావములు, నా జ్ఞానము అను స్వార్థభావములు మతములలోను, భక్త సమాజములలోను పెరిగిపోయాయి. క్రైస్తవులు ఇచ్చిన పుస్తకములను హిందువులు నిరాటంకముగా తీసుకొంటున్నారు. విూరిచ్చిన పుస్తకములు మేము తీసుకోమనీ, మేము చదువమని హిందూవులు అనడములేదు. కానీ ఒక హిందువు హిందూమతానికి సంబంధించిన పుస్తకమును క్రైస్తవులకు ఇస్తే క్రైస్తవులు "విూరిచ్చిన పుస్తకమును మేము చదువము మాకు వద్దని" నిరాకరిస్తు ముఖాన్నే చెప్పుచున్నారు. ఇదంతా మాయయొక్క మత ప్రభావము కాదా?

విశ్వమంతటిని సృష్ఠించిన దేవుడు, విశ్వమునంతటిని అంతము చేయగల దేవుడు, విశ్వములోని మానవులందరికి అధిపతియైన దేవుడు, అన్ని