పుట:Matamu-Pathamu.pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యోచించకుండ చేయుచున్నది. తాను నిర్మించిన మతమను పరిధిని దాటిపోయి విశాలముగా ఉన్న దేవున్ని మానవులు తెలుసు కొంటారేమోనని మాయకు దిగులు. అందువలన మాయ ప్రభావమున్నవారు మేము ఇతర మతముల పుస్తకములు చదవము, ఇతర బోధలు వినము అంటుంటారు. నిజముగా భర్తను ప్రేమించు భార్య బయట ఇతర పురుషున్ని చూచినా భర్తను వదిలి వాని వెంటపోదుకదా! అలాంటపుడు ఏ మతములోని వారైనా వారి మతములోని దేవున్ని పూర్తిగా విశ్వసించియుంటే ఇతర మతముల పుస్తకములు చదివినా, బోధలు వినినా వారి దేవున్ని వదలి పెట్టరు కదా! తన భర్త విూద నమ్మకములేని భార్య ఇతర పురుషున్ని చూస్తే తానెక్కడ తనభర్తను వదలిపోతానో అను భయమున్నపుడు ఇతరులను చూడకుండ జాగ్రత్తపడును. అలాగే తన దేవుని విూద విశ్వాసములేని మనిషి ఇతర మతముల పుస్తకములు చదివినా, బోధలు వినినా తన దేవున్ని, తన మతమును వదలిపోతానేమోనను భయముండును. అందువలన అటువంటివారు ఇతర మతగ్రంథములను ఇతర బోధలను వినరు, చదువరు.

ఇక హిందూమతములోని వారిని చూస్తే వారు ఒక దేవున్నికాక ఎందరో దేవుడు కాని దేవుళ్ళను వారే సృష్ఠించుకొని ఇష్టదేవుడు, ఇంటిదేవుడు, కులదేవుడని రకరకముల దేవుళ్ళను ఆరాధిస్తున్నారు. ఒక్క దేవున్నికాక ఎందరో దేవుళ్ళకు అలవాటుపడిన వారు కనుక ఇతర మతములోని దేవుని విూద కూడ వీరికి పెద్ద అసూయా భావముండదు. అందువలన క్రైస్తవులు పుస్తకములు ఇచ్చినా వాటిని చదువగలుగుచున్నారు. వారి బోధలు చెప్పినా వినగలుగుచున్నారు. ఎందరో హిందూమతమును వదిలి క్రైస్తవమతములోనికి పోయిన వారు కూడ ఉన్నారు. ఇదంతయు గమనిస్తున్న హిందూమత గురువులు, స్వాములు, పీఠాధిపతులు తాము చెప్పిన బోధలే వినాలి, తాము