పుట:Matamu-Pathamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముఖ్యముగ ఉన్న హిందు, ఇస్లామ్‌, క్రైస్తవ అను మూడు పథములు వాటివాటి పేర్లతోకాక మతముల పేర్లతోనే కలవు. మూడు మతములలోను అసలైన ఒకే దేవుని జ్ఞానమే ఉన్నప్పటికి మాయయొక్క మత ప్రభావము వలన అన్ని మతములలోను ఒకే దేవున్ని గురించి చెప్పారని మనుషులకు తెలియకుండపోయినది. క్రైస్తవులు మా దేవుడు "యెహోవా" అని అంటారు. ముస్లీమ్‌లు మా దేవుడు "అల్లా" అంటారు. హిందువుల విషయానికివస్తే వాళ్ళ దేవుడు ఎవరో కూడా వారికే తెలియని స్థితిలో ఉన్నారు. మతము అను మాయ అందరికి ఒకే దేవుడనీ, అందరిని సృష్ఠించినవాడొకడేననీ, సృష్ఠి మొదటినుండి చివరి వరకు జగతికంతా ఒకరే అధిపతియనీ, అతనే దేవుడని తెలియకుండ చేసినది. మా దేవుడు వారి దేవునికంటే గొప్ప అను భావమును అన్ని మతములలోను మాయ చొప్పించి పెట్టినది. అట్లు అనుకోవడమే పెద్దమాయ అని ఎవరు అనుకోవడములేదు. అంతేకాక మాయ మరొక భావమును కూడ మనుషులలో ఉండునట్లు చేసినది. అది ఏమనగా! మేము క్రైస్తవులము అనువారు బైబిలును గురించి మాట్లాడినా, ప్రభువును గురించి మాట్లాడినా సంతోషముగా వింటారు. అదే హిందూ మతములోని భగవద్గీతను గురించి మాట్లాడినా, శ్రీకృష్ణున్ని గురించి మాట్లాడినా విసుగుకొని వినరు. వినకపోవడమే కాకుండ శ్రీకృష్ణున్ని గురించి, భగవద్గీతను గురించి వ్యతిరేఖముగా మాట్లాడుదురు. అలావారు ప్రవర్తించుటకు ముఖ్యమైన కారణము ఏమంటే, మాయ మతమను ముసుగును వారికి తగిలించి దేవున్ని, దేవుని జ్ఞానమును పరిమితి చేసి చూపిస్తున్నది. కావున దేవుడు పూర్వమునుండి ఉన్నాడనీ, ఆయన కలియుగములో ప్రభువురూపములో వచ్చినట్లు ఇతర యుగములలో, ఇతర రూపములలో వచ్చియుండుననీ, బైబిలులో దేవుడు ప్రభువు రూపములో చెప్పినట్లు గీతలో కూడ దేవుడు చెప్పియుండు నేమోనని