ఈ పుట ఆమోదించబడ్డది
జాతిరత్నం దుర్గాబాయి
అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక పాప. ఆ పాప బడికి పోతోంది. చదువుకుంటోంది. టీచరు పాఠాలు చెపుతున్నాడు. ఆ చదువులు ఆ పాపకు ఎందుకో నచ్చలేదు. చదువులు దేనికి పనికొస్తాయో ఆ పాపకు అర్థంగాలేదు.
చదువు అందరికీ కావాలి. ఆడవాళ్ళకు తప్పకుండా కావాలి. చదువు అందరికీ వస్తుంది కూడా. అయితే ప్రేమగా చెప్పాలి. ఉపయోగపడే చదువు చెప్పాలి. ఇలా ఆ పాప ఆలోచన చేసింది.
తానే సొంతంగా బడి పెట్టింది. ఇరుగుపొరుగు ఆడవాళ్ళను పిలిచింది. వాళ్ళకు చదువు నేర్పసాగింది.
ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. మా అమ్మ చదువుకోలేదు గదా! ఆమెకూ ఎందుకు చెప్పగూడదు అనుకొంది. అంతే. వాళ్ళమ్మనూ పిలిచి కూచోబెట్టింది. చదువునేర్పింది!
ఎవరీ గడుగ్గాయి పిల్ల? ఆ వయసులోనే అంతకు పూనుకొన్న పిల్ల?
7