ఈ పుట ఆమోదించబడ్డది
వీర సైనికురాలు లక్ష్మీ సైగల్
మనం ఎన్నో కథలు విన్నాం. కత్తి దూసి యుద్ధం చేసిన మగవాళ్ళ గురించి తెలుసుకున్నాం. బాణాలతో పోరాటాలు చేసిన వాళ్ళ గురించీ చెప్పుకున్నాం.
కానీ అరవై ఏళ్ళ కిందటే - ఒక ఆడకూతురు మరతుపాకీ చేతబట్టిందంటే - యుద్ధం చేసిందంటే - నమ్మగలమా!
ఆ ధైర్యవంతురాలే లక్ష్మీ సైగల్.
ఆమె డాక్టరు చదువుకుంది. కానీ డబ్బు సంపాదనకి దిగలేదు. పైగా తనకి ఉన్నది కూడా ధారపోసింది. స్వరాజ్య పోరాటంలోకి దూకింది.
అప్పుడు మనని తెల్లవాళ్ళు పాలించే వాళ్ళు గదా! దేశంలో ఆడా మగా అంతా స్వరాజ్య పోరాటం జరిపారు.
తెల్లవాళ్ళ మీద పోరాటానికి నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఒక పెద్ద సైన్యం తయారుచేశాడు. ఆ సైన్యంలో మన లక్ష్మి ఒక అధికారి.
35