ఈ పుట ఆమోదించబడ్డది
బడికి పోతే దూరంగా కూచో పెడుతున్నారు. టీ తాగబోతే దూరంగా ఉంచిన గ్లాసుతోనే ఇస్తున్నారు.
తాను ఏం తప్పుచేశాడు? తనను ఎందుకిలా తరుముతున్నారు? తననేనా - తన జాతి వాళ్ళందరినీ ఎందుకు ఊరికి దూరంగా పెట్టారు? తామెందుకిలా ఉండాలి?
అంబేద్కర్ ను ఇలా ఆలోచనలు చుట్టుముట్టాయి. విలవిలలాడిన ఆ పసిమనసు ఉడికిపోయింది. దీన్ని తుదముట్టించాలి అనుకొన్నాడు. పట్టుపట్టాడు.
అంబేద్కర్ చాలా తెలివైన పిల్లవాడు. బడిలో బుద్ధిగా చదువుకొన్నాడు. టీచర్ల చేత సెభాష్ అనిపించుకొన్నాడు.
వాళ్ళ నాన్న పై చదువులకు బొంబాయి పంపాడు. అక్కడ అవమానాలు ఎదురైనాయి. అవి అతనిలో మరింత పట్టుదల పెంచాయి.
ఆ పైన ఇతర దేశాలకు పొయ్యాడు. అక్కడా పెద్ద పెద్ద చదువులు చదివాడు. ఈ చదువులకు ఒక మహారాజు సాయం చేశాడు.
32