Jump to content

పుట:Manushullo Manikyam VBS JVV.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలుపులేని వీరుడు అంబేద్కర్

బంగారం పుటం పెడితే ఎరుపెక్కుతుంది. ఇనుంపై సమ్మెట పోటు పడితే నిప్పులు చిమ్ముతుంది. బంతిని నేలకేసి కొడితే పైకెగురుతుంది.

కష్టాల నుంచి, అవమానాల నుంచి గొప్ప వాళ్ళు పుడతారు. తయారవుతారు.

మనం ఆప్యాయంగా పిల్చుకొనే అంబేద్కర్ అలాంటి వాడు.

పదేళ్ళ వయసులో ఒకసారి ఆయన పొరుగూరికి పోతున్నాడు. నిప్పులు చెరిగే ఎండ. నాలుక ఆరిపోతోంది. ఒకింటికి పోయి నీళ్ళు అడిగాడు. ఇల్లాలు తలుపు తెరిచింది. ఆయన్ను చూసి నీది ఏ కులం అని అడిగింది. చెప్పగానే దభాలున తలుపు వేసేసింది.

అద్దె బండి ఎక్కడానికి పోయాడు. అక్కడా అదే జరిగింది.

30