Jump to content

పుట:Manushullo Manikyam VBS JVV.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తుడవాలి. అంతకంటె గొప్ప మతం లేదు. భక్తిలేదు. సేవలేదు. ఇదీ ఆమె నమ్మకం.

ఇప్పుడు ఆమె సేవ దేశాలను దాటింది. 71 దేశాల్లో ఆమె ఆశ్రమాలు, ఆసుపత్రులు, బడులు ఉన్నాయి. ఆమె సాయంతో చదువుకొన్న వాళ్ళు డాక్టర్లు అయ్యారు. ఇంజనీర్లు అయ్యారు. అధికార్లు అయ్యారు. ఎంతో గొప్ప వాళ్ళయ్యారు. వాళ్ళందరికీ ఆమె అంటే ఎంత అభిమానమో చెప్పలేము.

మదర్ థెరిసా ఎప్పుడూ ఎవర్నీ చెయ్యి చాచి అడగలేదు. పదవుల కోసం పాకులాడలేదు. బిరుదుల కోసం ఎగబడ లేదు. పొగడ్తల కోసం ఎదురుచూడలేదు.

అయితే ఆ తల్లిని వెదుక్కొంటూ బహుమతులు వచ్చాయి. బిరుదులు వచ్చాయి. ప్రపంచంలో ఎవ్వరికీ దక్కని పేరు ఆమెకు దక్కింది. మన దేశంలో అన్నిటికంటె గొప్ప బిరుదు 'భారత రత్న' ఆమెకు దక్కింది.

28