Jump to content

పుట:Manushullo Manikyam VBS JVV.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ రోజునుంచి వాళ్ళ కోసం అన్నీ వదులుకోవాలని తీర్మానించుకొంది.

ఆమె పేరు ఏమిటో తెలుసా? మదర్ థెరిసా. మదర్ అంటే అమ్మ. ఆమె అందరికీ అమ్మలాంటిది గాబట్టి ఆమె పేరుకే అమ్మ చేరి పోయింది.

ఆమెది మన దేశం కాదు. ఇక్కడామెకు చుట్టాలు నేస్తాలు లేరు. ఎక్కడో యుగోస్లేవియా దేశం నుంచి వచ్చింది. ఇక్కడి పేదలకోసం అన్నీ వదులుకొంది.

ఆమె నిరు పేదల కోసం ఒక ఆశ్రమం పెట్టింది. అందులో రోగులకు వైద్యం ఉచితం. పిల్లలకు చదువులు ఉచితం. అనాథ లందరికీ అది ఆదుకొనే చోటు.

ఇలాంటి పనులు చూచి, ఆమెకు ఎంతోమంది సాయపడ్డారు. కొందరు ఇళ్ళు ఇచ్చారు. కొందరు డబ్బు ఇచ్చారు. కొందరు తోడు నిలబడ్డారు.

దీంతో ఆమె ఇంకా చాలా ఆశ్రమాలు పెట్టింది. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా ఆదుకోసాగింది. సాటి మనిషి కన్నీళ్ళు

27