Jump to content

పుట:Manushullo Manikyam VBS JVV.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాళ్ళ దెబ్బకు సిపాయిలు తట్టుకోలేకపోయారు. చాలా మంది చచ్చారు. మిగిలిన వాళ్ళు పారిపొయ్యారు.

మళ్ళీ పెద్ద దండు వచ్చింది. ఈసారి కొమరం భీమును వాళ్ళు దొంగతనంగా కాల్చారు. ఆయన నేలకొరిగాడు. ఇది 1940 సెప్టెంబరు 1వ తేదీ జరిగింది!

అయితేనేం? అప్పటి నుంచీ గోండులకు కొంత అధికారం ఇవ్వక తప్పలేదు.

భీమును గోండులు తమ జాతిలో పుట్టిన భీముడనే అనుకొంటారు. గుండెలకు హత్తుకుంటారు. ఆయన మీద పాటలు గట్టి పాడుకొంటారు.

24