Jump to content

పుట:Manushullo Manikyam VBS JVV.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొదమ సింగం కొమరం భీము

పిల్లి పులిగా మారితే ఎలా వుంటుంది? మరి పిల్లి ఎప్పుడైనా పులిగా మారుతుందా?

మారుతుంది. నాలుగు గోడల మధ్య వేసి కొడితే పిల్లి ఏం చేస్తుంది? పులిలాగా పైకి దూకి రక్కుతుంది.

మన కొమరం భీము అలాంటి పులి.

మన భీము గోండు జాతి వాడు. గోండులు అడవుల్లో వుండే గిరిజనులు.

వాళ్ళు అడివితల్లి బిడ్డలు. చెట్లలో, పాదల్లో, కొండల్లో, కోనల్లో, వాగుల్లో వంకల్లో పుట్టి పెరిగే వాళ్ళు. వాళ్ళు జింకల్లా అమాయకులు. కుందేలు పిల్లల్లా కల్లాకపటం తెలీని వాళ్ళు.

గోండులు చెట్టూ పుట్టా కొట్టుకొని సేద్యం చేస్తారు. జొన్న పండిస్తారు. అందులో మూడు నెలలకు సరిపడే పంట కూడా రాడు. మిగతా కాలం కాయా కసురూ, ఆకూ

20