Jump to content

పుట:Manushullo Manikyam VBS JVV.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాగులమ్మ, లచ్చుమమ్మలు తప్పించుకుని పరుగెత్తారు. రైలు గేటు దగ్గర ఒక రాతి గూడు ఉండేది వాళ్ళు దాంట్లో దూరి తలుపులు బిగించుకున్నారు.

హంపన్న దెబ్బకు ఒక సిపాయి చచ్చాడు. మిగతా వాళ్ళు తుపాకితో హంపన్న తలమీద మోదారు. ఆయన తెలివి తప్పిపడిపోయాడు.

సిపాయిలు రాతిగూడు తలుపులు పగలగొట్టసాగారు. ఈ చప్పుడుకి మళ్ళీ హంపన్న లేచాడు. పులి పిల్లలాగ వాళ్ళ మీదికి ఉరికాడు. ఇంతలో ఒక సిపాయి వెనక నించి పిస్తోలుతో కాల్చాడు. హంపన్న కూలిపోయాడు.

ఈ గొడవకు ఊరంతా అక్కడ చేరింది. దీంతో సిపాయిలు జారుకున్నారు.

హంపన్న పోరాటం అందర్నీ కదిలించించి వేసింది. ఊరు ఊరంతా హంపన్నకు హారతి పట్టింది. బాట పక్కనే సమాధి కట్టారు. ఒక రాతిమీద హంపన్న గొప్పదనం చెక్కించారు. దాన్ని సమాధి దగ్గర పెట్టారు.

14