ఈ పుట ఆమోదించబడ్డది
పెత్తనం చేసేవాళ్ళు. వాళ్ళు మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చారని హంపన్నకు కోపం.
ఇలా ఉంటే ఓ సంగతి జరిగింది. హంపన్నకు నాగులమ్మ, లచ్చుమమ్మ మంచి నేస్తాలు, వాళ్ళు కష్టం చేసుకునే ఆడపడుచులు.
ఒకసారి తెల్ల సిపాయిలు వందలాదిగా గుంతకల్లుకు వచ్చారు. గుడారాలు వేసుకుని మకాం పెట్టారు. వాళ్ళలో కొందరికి నాగులమ్మ, లచ్చుమమ్మల మీద కన్నుబడింది.
ఒకరోజు సాయంత్రం వాళ్ళిద్దరినీ సిపాయిలు అడ్డుకున్నారు. బలవంతం చెయ్యబోయారు.
వాళ్ళు మానవతులు. బొడ్డులోంచి కొడవలి తీశారు. ఎదుర్కొన్నారు. అయినా సిపాయిలదే పైచేయి అయింది. భయంతో పెద్దగా అరిచారు.
హంపన్న ఈ అరుపులు విన్నాడు. ఎక్కడ లేని రోషం వచ్చింది. చిక్కుడు పందిరి కర్ర తీసుకుని పరుగెత్తాడు. సిపాయిల్ని ఎదుర్కొన్నాడు.
13